Tamota price decline sharply

tamota-price-decline-sharply

tamota-price-decline-sharply

16.png

Posted: 09/21/2012 04:22 PM IST
Tamota price decline sharply

       ఆరుగాలం శ్రమించి కష్టించిన రైతు బతుకు దిక్కుతోచని పరిస్థితుల్లో పడింది. చెల్లని పావలా మాదిరిగా తయారైంది. రైతు పండించిన tamota_1కిలో టమోట ధర పావలా పలుకుతుంది. దీంతో మార్కెట్ లోకి తీసుకొచ్చిన టమోటాలను మార్కెట్ లోనే వదిలి వెళ్తున్నారు. మరి కొంత మంది రైతులు టమోటాలకు గిట్టు బాటు ధర లేక పోవడంతో వదిలి వేశారు. దీంతో పంటలు పశువులు, గొర్లకు పశుగ్రాసంగా మారింది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా టమోట పంటలను సాగుచేస్తుంటారు. అయితే జూన్, జూలై మాసాల్లో టమోట ధర కిలో హోల్ సెల్ గానే 20 రూపాయలు పలుకగా tamota_2రైతులు ధర నిలకడగా ఉంటుందని, అలా ఉండకపోతే కనీసం కిలో కు 6నుండి 8రూపాయల ధర పలుకుతుందని ఆశ పడి టమోటను సాగుచేశారు. అయితే టమోట తెంపడాని రాగానే మార్కెట్ ధర కిలో పావలా కు పడిపోయింది. కర్నూల్ మార్కెట్ లో రైతులు వారు పండించిన టమోటలను వదిలివేయడంతో పశువులకు గ్రాసంగా మారింది. ఒక ఎకరం టమోట సాగు చేస్తే రైతుకు కనీసం 20నుండి 30వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. అయితే ఇప్పటి పరిస్థితుల్లో పావలాకు కిలో చొప్పున కొన్ని మార్కెట్లో ధర పలుకడంతో రైతులు దిక్కతోచని పరిస్థితుల్లో పడిపోవడంతో పాటు అప్పుల్లో కూరుకు పోయారు. ఎకరం టమోట సాగు చేసినటువంటి రైతుకు రోజుకు దాదాపు 10 క్వింటాళ్ల చొప్పున టమోటలు వస్తే క్వింటాల్ కు ధర 25 రూపాయలు పలికితే 10 క్వింటాళ్లకు మొత్తం 250 రూపాయలు వస్తాయి. అంటే రైతుకు టమోటలు తెంపిన ఖర్చులు కూడా రావడం లేదు. దీంతో రైతులు వారి పంటలను పశువులకు వదిలి వేస్తున్నారు. ఇంతటి దారుణ మైన పరిస్థితి తలెత్తటంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతన్న శ్రమకు విలువకట్టే షరాబు ఎవరు..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manmohan sonia rahul
Gurajada apparao birthday celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles