Gurajada apparao birthday celebrations

gurajada-apparao-birthday-celebrations

gurajada-apparao-birthday-celebrations

11.png

Posted: 09/21/2012 03:59 PM IST
Gurajada apparao birthday celebrations

       ‘దేశమును ప్రేమించుమన్న..మంచి అన్నది పెంచుమన్న....’  ఈ నాధం మరో మారు మారుమ్రోగింది. యావత్ ఆంధ్రావనికీ దిశనిర్ధేశం చేసి దేశభక్తిని నింపిన మహాకవి గురజాడ అప్పారావు పుట్టిన రోజు పండుగను రాష్ట్రమంతటా ఘనంగా నిర్వహించారు. ప్రతి ఊరిలోనూ బాలబాలికలు ఆయన గేయాన్ని ఆలపించి పరవశించిపోయారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గురజాడ 150వ జయంతి gurajadaవేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు తమిళనాడు గవర్నర్ రోశయ్య తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గురజాడ మనవరాలు శేషమ్మను సీఎం సత్కరించారు. ఆమెకు ప్రభుత్వం తరపున నెలకు 10వేల రూపాయల ఫించను ప్రకటించారు.
        మహనీయులు గురుజాడ అప్పారావు 150 జయంతి వేడుకలు మూడోరోజూ విజయనగరం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. గురజాడ రచించిన 'దేశమును ప్రేమించుమన్న ... మంచి అన్నది పెంచుమన్న' గేయాన్ని పదివేల మంది విద్యార్థులు సామూహికంగా ఆలపించారు. ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ గేయ ఆలపనలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి గేయాలాపనలో పాల్గొన్నారు. అంతకు ముందు గురజాడ స్వగృహంనుంచి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వరకూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamota price decline sharply
Gas subsidi cylendors rise  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles