No differences with chiru botsa

PCC president Botsa Satyanarayana, Rajyasabha member Chiranjeevi, Botsa Satyanarayana, Rajyasabha member, Chiranjeevi

PCC president Botsa Satyanarayana clarified that he has had no differences with Rajyasabha member Chiranjeevi. He said that his comments were not intended towards Chiranjeevi

No Differences With Chiru - Botsa.png

Posted: 09/13/2012 02:56 PM IST
No differences with chiru botsa

Botsaపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ను పతనం చేస్తామని చెప్పినవారే కాంగ్రెస్ లో కలిసిపోయారని బొత్స అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు అయిన చిరంజీవినే ఉద్ధేశించి మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి చిరంజీవి కూడా బొత్స పై పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అయితే మీడియా పదే పదే ప్రచారం చేయడంతో బొత్స దీని పై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ విషయం పై మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన బొత్స తాను చిరంజీవిని ఉద్ధేశించి అనలేదని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్ధేశించి మాత్రమే అన్నానని ఆయన తెలిపారు.

రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో తనకు ఎటువంటి విభేదాలు లేవని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇటీవల తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు జూబ్లీహాలులో నిర్వహించిన మేధోమథనం సదస్సుకు చిరంజీవి హాజరు కావడంలో తప్పేమి లేదని అన్నానని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వంశ పారంపర్య పార్టీ కాదని బొత్స సత్యనారాయణ తెలిపారు. మరి ఇక్కడితోనైనా చిరు, బొత్స మధ్య రగిలిన మాటల యుద్ధం అగుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Case filed against jeevitha and rajasekhar under 420 section
Mim against telangana asaduddin owaisi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles