Minister stages walk out at workshop n visakhapatnam

Minister stages walk-out at workshop n Visakhapatnam, Galla Aruna Kumari, P. Balaraju, illegal mining, Andhra Pradesh politics

Minister stages walk-out at workshop n Visakhapatnam

Minister.gif

Posted: 09/07/2012 03:20 PM IST
Minister stages walk out at workshop n visakhapatnam

Minister stages walk-out at workshop n Visakhapatnam

విశాఖలో మంత్రులు గల్లా అరుణకుమారి, బాలరాజుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇసుక వినియోగం, ప్రత్యామ్నాయ పద్దతులు అంశంపై నిర్వహించిన సెమినార్ లో మంత్రుల మధ్య వివాదం చెలరేగింది. ఇసుకమాఫియా నిరోధం కోసం గనులశాఖ ఆధ్వర్యంలో విశాఖ జలఉద్యానవనంలో సెమినార్ నిర్వహించారు. సమావేశంలో మంత్రులు గల్లా, బాలరాజు, గంటా.శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇసుక మాఫియా కారణంగా సామాన్యుడు ఇళ్లు కట్టుకోవాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోందని బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. ఇసుక దోచుకుపోతుంటే మీరేం చేస్తున్నారని గల్లా అనడంతో.. బాలరాజు ఆగ్రహం చెందారు.తానేం కాపలాదారుణ్ణి కాదన్న ఆయన.. గల్లా వ్యాఖ్యలతో మనస్తాపం చెంది సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.

బాలరాజును అవమానపరిచే ఉద్దేశ్యం తనది కాదని గల్లా తెలిపారు. సోదరుడిగా భావించే.. తానలా మాట్లాడానని.. తన మాటల్తో బాధ పడి ఉంటే వెనక్కి తీసుకుంటానని చెప్పుకొచ్చారు. మొత్తానికి మంత్రుల మాటల యుద్ధంతో సమావేశం వేడెక్కింది.ముఖ్యమంత్రికిరణ్ రెడ్డికి తనకు ఎలాంటి విభేదాలు లేవని మంత్రి గల్లా అరుణకుమారి స్పష్టంచేశారు. చిత్తూరు జిల్లా మల్లయ్య కొండ బంగారు గనుల విషయంలో తనపై ఎవరి ఒత్తిళ్లూ లేవన్నారు. ఉపఎన్నికల్లో సీటు కేటాయించలేన్నంత మాత్రాన తనకు సీఎంకు విభేదాలు ఏర్పడ్డాయన్నది వాస్తవం కాదన్నారు. 2014 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని....తన కుమారుడు రాజకీయ రంగంపై ఉన్న ఆసక్తితో బరిలోకి దిగుతాడని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hike in petrol diesel prices likely within 48 hours
Video shows nit warangal student being kicked  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles