Sri lankan tourists attacks in tamil nadu

Sri Lankan tourists face fresh attacks in Tamil Nadu, India-Sri Lanka relations, Sri Lankan defence personnel training, Sri Lankan Tamils issue, ethnic conflict, Sri Lankan travel advisory, Tamil sentiments, Poondi Madha shrine, VCK protests

Sri Lankan tourists face fresh attacks in Tamil Nadu

Tamil.gif

Posted: 09/05/2012 01:32 PM IST
Sri lankan tourists attacks in tamil nadu

Sri Lankan tourists face fresh attacks in Tamil Nadu

తమిళులపై దాడికి పాల్పడుతున్న లంకేయులను శిక్షించాల్సిందేనని గళమెత్తుతున్న రాష్ట్ర వాసులు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. తంజావూరు సమీపంలోని క్రైస్తవ ఆలయ దర్శనానికి వచ్చిన లంకేయులను తరిమికొట్టినంత పని చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.తంజావూరు సమీపంలోని పూండీలో ప్రసిద్ధి గాంచిన క్రైస్తవ మాతా ఆలయం వుంది. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు 184 మంది శ్రీలంక దేశస్థులు పూండీకి చేరుకున్నారు. శ్రీలంక నుంచి తిరుచ్చికి విమాన మార్గం ద్వారా వచ్చిన వీరంతా అక్కడ నుంచి వ్యాన్‌లో పూండీకి చేరుకున్నారు. ఆలయానికి సమీపంలో ఉన్న విడిది గృహాలలో బస చేశారు. వీరంతా ఆలయ ఉత్సవాల్లో పాల్గొనేందుకు నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితుల్లో శ్రీలంకకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పూండీకి చేరుకున్నట్టు స్థానికంగా వున్న పలు తమిళ సంఘాలకు సమాచారం అందడంతో పెద్ద సంఖ్యలో తమిళ సంఘాల ప్రతినిధులు విడిది గృహాల వద్దకు చేరుకున్నారు. విడిది గృహాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. 'శ్రీలంకేయులను వెంటనే బయటికి పంపించండి లేకపోతే పరిస్థితులు దారుణంగా వుంటాయి' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Sri Lankan tourists face fresh attacks in Tamil Nadu

పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదముందని గ్రహించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపచేసేందుకు యత్నించారు. నామ్ తమిళర్ ఇయక్కం ప్రతినిధి న్యాయవాది నల్లదురై, వీసీకే నేత వివేకానందన్, తమిళ్ దేశ పొదువుడమైప్పు పార్టీ నేత పాల్‌రాజ్‌ల నేతృత్వంలో భారీగా తరలివచ్చిన ఆందోళనకారులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. శ్రీలంకేయులను వెంటనే అక్కడి నుంచి వెనక్కి పంపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఎంత నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో పోలీసులు కొంత మెత్తబడ్డారు. లంకేయులను వెనక్కి పంపించేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mps fight in rajya sabha over quota
Yashoda hospital doctor kidnapped  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles