Cpi narayana future predictions

cpi narayana future predictions, cpi congress tdp, ysrcp

cpi narayana future predictions

8.gif

Posted: 09/02/2012 03:38 PM IST
Cpi narayana future predictions

      భవిష్యత్తులో కేంద్రం, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ఉండదని, తెలంగాణ ఇవ్వదలచుకుంటే ఇవ్వొచ్చని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ ఇవ్వకుండా తప్పించుకునేందుకే ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. 2009లో తెలంగాణ వాదాన్ని ఆంగీకరించినcpi టీడీపీ ఆతర్వాత తప్పుకుందన్నారు. ఇప్పటకీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఎంటో స్పష్టం చేయలేదన్నారు. విజయవాడలో లగడపాటి కొట్లాడినా నిజామాబాద్  లో  మధుయాష్కీ కొట్లాడినా ఇద్దరూ ఢిల్లీలో సోనియాకు పూజలు చేయాల్సిందేనని నారాయణ అన్నారు. మంత్రులు అవినీతి పరులవుతున్నారని ఆయన ఆరోపించారు. ధర్మాన ప్రసాద్ లో ధర్మం నేతి బీరకాయలో నేతి ఎంతుందో ఆయనలో అంతే ఉందన్నారు. వారి కేసులకు అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని కానీ విద్యార్ధుల ఫీజులను మాత్రం భరించడలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటమార్చడంతోనే నిరుద్యోగులు, యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. 48 రోజుల పాటు సకల జనుల సమ్మె చేసి ఉద్యోగులు సత్తా చూపెట్టారన్నారు. తిరిగి అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని నారాయణ పిలుపునిచ్చారు.
      ఖమ్మం నుంచి చేపట్టిన నారాయణ తెలంగాణ ప్రజాపోరు యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. రాత్రి ఆదిలాబాద్ కు చేరుకున్న నారాయణ యాత్రకు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ జేఏసీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. వరంగల్ లో చేపట్టే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana agitations shuru
Mp spy reddy takes back resignation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles