Telangana agitations shuru

telangana agitations shuru, political jac, trs, bjp,

telangana agitations shuru

6.gif

Posted: 09/02/2012 03:42 PM IST
Telangana agitations shuru

      telangana_1  తెలంగాణ ఉద్యమాన్ని మరింత వేగం చేసేందుకు తెలంగాణ జేఏసీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. సెప్టెంబర్ 30 నిర్వహించ తలపెట్టిన తెలంగాణ మార్చ్ కార్యక్రమానికి ముందే అన్ని జల్లాలో కవాతు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఇప్పటికే హైద్రాబాద్ నగరంతో పాటు, అన్ని జిల్లా, మండల స్థాయిల్లో జెఎసి సమావేశాలు నిర్వహించింది. కింది స్థాయి నుంచి ఆందోళన కార్యక్రమాలను తీసుకుంది. మరో వైపు జిల్లాలో జరిగే కవాతుల కోసం రాజకీయ పార్టీల మద్దతూ కూడగడుతోంది. మరోవైపు సిపిఐ నిర్వహిస్తున్న తెలంగాణ పోరు యాత్రకు జెఎసి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నెల 3వ తేదీ నుండి ఢిల్లీలో బిజెపి నిర్వహించనున్న ఆందోళనలకు కూడా జెఎసి మద్దతు telangana_2ప్రకటించింది. జెఎసిలోని భాగస్వామ్య సంఘాలతో పాటు, పార్టీల మద్దతు కూడా కవాతుల నుంచి మార్చ్ కార్యక్రమం వరకు విజయవంతం చేసేందుకు తగిన ప్రణాళిక సిద్దం చేసినట్లు జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రకటించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 30న జరిగే తెలంగాణ మార్చ్ పోస్టర్ ను కోదండరాం, ఇతర జెఎసి నాయకులు ఆవిష్కరించారు. 4వ తేదీన ముల్కీ అమరవీరుల దినోత్సవాలను జరపుకోవాలని జేఏసీ పిలుపునిచ్చింది. అదే రోజు సాయంత్రం కొవ్వత్తులు వెలిగించి అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fee reimbursement for bc sc st
Cpi narayana future predictions  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles