Lord ramas date of birth

Lord Rama's date of birth scientifically calculated, Ramayana, Rama, Date of birth, Institute for Scientific Research on Vedas

Lord Rama's date of birth scientifically calculated

Lord Rama.gif

Posted: 08/28/2012 07:13 PM IST
Lord ramas date of birth

Lord Rama's date of birth scientifically calculated

గాంధీ గారు పుట్టి తేదీ తెలుసు? అలాగే గౌతమ బుద్దుడు పుట్టిన తేదీ తెలుసు?  చంద్రమండలం ఎంత దూరమో కూడా మనం చెప్పగలం. కానీ  రాముడు పుట్టిన తేదీ ఎవరికైన తెలుసా? ఆయన పుట్టిన రోజు ఎప్పుడు వస్తుంది? ఏ నెలలో  వస్తుంది. అనేక ప్రశ్నలు అందరికి వస్తాయి. రాముడు పెళ్లి రోజు జరుపుకుంటాం గానీ .. రాముడు పుట్టిన రోజు ఎందుకు చేసుకోం? అంటే ఆ రోజు మనకు తెలియాదు కాబట్టి.  ఇక నుండి ఆ భయం లేదు  మనకు రాముడు ఎప్పుడు పుట్టిందో తెలిసిపోయింది. రామాయణం నిజజీవిత కథా? వాల్మీకి కల్పనా? అది ఒట్టి కావ్యమేనా? చారిత్రక గాథా? రాముడు దేవుడా? మానవమాత్రుడేనా? లేక రామాయణకావ్యంలో పాత్ర మాత్రమేనా? ..నాస్తికులకు, అప్పుడప్పుడూ ఆస్తికులకూ వచ్చే సందేహాలివి! కానీ, రామాయణం నిజంగా జరిగిందని.. రాముడు భరతభూమిపై జన్మించాడని.. అయోధ్యా పురవీధుల్లో నడయాడాడని.. ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రిసెర్చ్ ఆన్ వేదాస్ (ఐ-సర్వ్) పరిశోధకులు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.

"రాముడు జన్మించినప్పుడు ఐదు గ్రహాలు ఉచ్ఛదశలో ఉన్నాయి. చైత్రమాసం, శుక్లపక్షం, నవమినాడు అభిజిల్లగ్నంలో శ్రీరామ చంద్రుడు జన్మించాడు. ఆయన జాతకంలో ఐదుగ్రహాలు ఉచ్ఛలో ఉన్నాయి. వనవాసానికి వెళ్లేటప్పటికి రాముడి వయసు 25 సంవత్సరాలు'' అంటూ రామాయణంలో వాల్మీకి చెప్పిన వివరాల ఆధారంగా వారు తమ పరిశోధన మొదలుపెట్టారు. ప్లానిటేరియం అనే సాఫ్టవేర్ ద్వారా వర్తమాన కాలం నుంచి ఒక్కొక్కరోజే వెనక్కి వెళుతూ, గ్రహగతులను, స్థితులను లెక్కగడుతూ రాముడి పుట్టిన రోజును నిర్ధారించారు. వారి సాఫ్ట్‌వేర్ ప్రకారం రాముడి జనన తేదీ... క్రీ.పూ.5114, జనవరి 10. ఇదే పద్ధతిలో.. క్రీస్తుకు పూర్వం జరిగిన అనేక కీలక ఘటనల తేదీలను వారు లెక్కించారు.

నిజమేనా?

రాముడి పుట్టినరోజును జనవరి 10గా నిర్ధారించడంపై పలు సందేహాలున్నాయి. ఎందుకంటే.. జనవరి నెలలో చైత్రమాసం రాదని పలువురు సిద్ధాంతులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం.. అధికమాసాల లెక్క సరిచేసుకుంటూ వెళ్తే త్రేతాయుగంలో చైత్రమాసం జనవరిలో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.కానీ, అధికమాసాల లెక్క వేసేదే అదనంగా ఉన్న రోజులను సంవత్సరంలో కలపడానికి కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ జనవరిలో చైత్రమాసం రాదు అని బల్లగుద్ది చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. పురాణగాథల ప్రకారం కృతయుగం కాలవ్యవధి 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగం.. 12,96,000, ద్వాపరయుగం.. 8,64,000, కలియుగం.. 4,32,000 సంవత్సరాలు. ప్రస్తుతం కలియుగంలో 5,106 సంవత్సరాలు జరిగాయని పండితుల లెక్క.  ఈ లెక్కన కలియుగ ప్రారంభానికి దాదాపు రెండువేల సంవత్సరాల ముందు మాత్రమే రాముడు పుట్టి ఉండాలి. అంటే మధ్యలో ద్వాపరయుగం లెక్క మారుతుంది. ఇది పురాణాలు చెప్పే కాలమానానికి విరుద్ధం. ఈ సందేహాలన్నిటికీ ఐ-సర్వ్ పరిశోధకులే సమాధానం చెప్పాలి మరి!!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ban on heritage milk in kerala
Manmohan singh is silence better  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles