సహారా క్యూ షాప్ కోసం సచిన్ టెండూల్కర్ నటించిన యాడ్ అభ్యంతరకరంగా ఉన్నందున తక్షణమే దానిని ఆపాలని బీసీసీఐ సహారా పరివార్‌ను కోరింది. ఆ యాడ్‌ను ఆపాలంటూ సచిన్‌తో పాటు ఇతర టీమిండియా ఆటగాళ్లు కోరడంతో బీసీసీఐ సహారాకు నోటీసులు పంపింది. అలాంటి అ భ్యంతరకరమైన సన్నివేశాలను చిత్రీకరించడం బీసీసీఐ-సహారా మధ్య జరిగిన ఒప్పందాలను ఉల్లంఘించినట్లేనని బోర్డు పేర్కొంది. రిటైల్ మార్కెట్‌లోకి ప్రవేశించిన సహారా గ్రూప్.. క్యూ షాప్ పేరుతో దేశవ్యాప్తంగా అవుట్‌లెట్లను తెరిచింది. ప్రస్తుతం ఈ సూపర్ బజార్లను ఉత్తర భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో ప్రారంభించింది. ఆ షాపుల్లో వస్తువులు కొనకపోతే అందరూ చావును కొని తెచ్చుకున్నట్టేనన్నది యాడ్ సారాంశం. పార్లమెంట్ సభ్యుడైన సచిన్ ఇలాంటి సన్నివేశాల్లో నటించడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. సచిన్ సన్నిహితులు, ఇతర టీమిండియా సభ్యులు కూ డా ఆ యాడ్ అభ్యంతరకరంగా ఉందని అన్నారు. ఇంతకీ ఆ యాడ్‌లో ఏముందంటే.. -ఆ యాడ్‌లో సచిన్ భుజంపై కుండ పెట్టుకుని డైనింగ్ టేబుల్‌పై భోజనానికి కూర్చున్న ముగ్గురు సభ్యుల కుటుంబానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లుగా కనిపిస్తాడు. - ఐస్ క్రీం తింటున్న ఒక బాలుడిని చూస్తూ శ్మశానం లో యువరాజ్ గోతిని తవ్వుతున్నట్లుగా.. - ఒక ఇంట్లో చంటిపాప ఊయల స్థానంలో ఆస్పత్రి బెడ్‌ను, దానికి సెలైన్ పెడుతున్నట్టుగా సెహ్వాగ్.. -మరోచోట సూపర్ బజార్‌లో వస్తువులు కొంటున్న వారి ట్రాలీ స్థానంలో ఆస్పత్రి వీల్ చెయిర్ పెడుతున్నట్లుగా కోహ్లీ కనిపిస్తాడు. - చివర్లో ధోనీ క్యూ షాప్ గొప్పదనం వివరిస్తాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more