Mega star meets powerful women sonia

Chiranjeevi, Chiru CM, Kiran, Shankar Rao, Sonia Gandhi

There must be some major developments going on in Delhi, said political observers after they came to know the meeting of former minister Shankar Rao with UPA chairperson Sonia Gandhi

Mega star meets powerful women sonia.png

Posted: 08/23/2012 05:10 PM IST
Mega star meets powerful women sonia

Chiranjeeviకాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఈ రోజు యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆమె తో చిరంజీవి చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య చిరంజీవి సోనియా గాంధీతో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలు అంతా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ సమయంలో చిరు సోనియాని ఎందుకు కలిశారు ? తమనకు అందిన సమాచారం ప్రకారం సోనియా చిరు నుండి రాష్ట్ర పరిస్థితుల పై ఆరాతీశారని తెలుస్తుంది.

ఇక ముఖ్యమంత్రి మార్పు తథ్యమం అని గత కొన్ని రోజుల నుండి ఊహాగానాలు వస్తున్నా, వాటిని ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు కొట్టిపారేస్తున్నారు. తాజా ఏఐసీసీ సభ్యుడు క్రిష్ణమూర్తి కూడా ముఖ్యమంత్రి మంత్రి మార్పు ఉండదని చెప్పారు. అయినా చిరు సోనియాని కలవడంతో మళ్ళీ పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఈయన భేటికి తోడు చిరంజీవి తన జన్మదినం రోజు మాట్లాడుతూ ప్రజలు నన్ను ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారని, అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో  కాంగ్రెస్ వర్గాల్లో మళ్ళీ అనుమానాలు తలెత్తాయి. కేంద్రమంత్రి పదవిని చిరంజీవికి ఇవ్వాలని భావిస్తున్నప్పటికీ ఇప్పట్లో విస్తరణ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో చిరంజీవికి రాష్ట్రంలో ఏవైనా బాధ్యతలు అప్పగించనున్నారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి కాలం కలిసివస్తే చిరు సీఎం అవడం ఖాయంగా కనిపిస్తుంది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dharmana prasada rao resignation will be accepted
Bcci objects to sachin tendulkars last rites act in sahara commercial  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles