Actress kamaladevi passes away

TG Kamaladevi, Chennai, Chittoor district, Kalaprapurna Award

TG Kamaladevi, Chennai, Chittoor district, Kalaprapurna Award

Actress Kamaladevi passes away.png

Posted: 08/16/2012 08:32 PM IST
Actress kamaladevi passes away

Kamaladeviప్రముఖ దర్శకుడు బిఎన్ రెడ్డి 1951లో తీసిన క్లాసిక్ ‘మల్లీశ్వరి’ సినిమాలో హీరోయిన్ గా (భానుమతి) పాత్రలో నటించిన టీజీ కమలాదేవి ఇవాళ చెన్నైలో కన్నుమూశారు. ప్రస్తుతం ఈమె వయస్సు 84. ఈమెకి ఆమె తల్లిదండ్రులు పెట్టిన పేరు గోవిందమ్మ. ఈమె స్వస్థలం చిత్తూరు జిల్లా కార్వేటి నగరం. ఈమె ‘చూడామణి ’, ‘దక్షయజ్ఞం’ చిత్రాల్లో కూడా నటించారు. అటు తర్వాత వరస పెట్టి ‘బాల నాగమ్మ ’, ‘ముగ్గురు మరాఠీలు ’, ‘గుణ సుందరి కథ’, ‘మాయలోకం’ లాంటి సినిమాలు 70 వరకూ చేస్తూ పోయారు.  సినిమాల్లోకి రాకముందే టీజీకే నటిగానూ, గాయనిగానూ మంచి పేరు తెచ్చుకుంది. ఆమె రంగస్థలంమీద ఎన్నో పురుష పాత్రలను ధరించి మెప్పించింది. నటిగా, గాయనిగా కాకుండా డబ్బింగ్ కళలో కూడా టీజీకే ఆరితేరారు. పద్మిని, లలిత, బి.సరోజాదేవి తదితర హీరోయిన్లకు టీజీకే గొంతు ఎరువిచ్చారు. ఆమెను  ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమి నాటక కళా ప్రపూర్ణ అవార్డుతో సత్కరించారు. కమలాదేవి మృతికి తెలుగు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈమె మరణం పరిశ్రమకు తీరని లోటుగా వర్ణించారు. ఈమెకు ఆంధ్ర విశేష్ కూడా ఘన నివాలి అర్పిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maruti to fire 1000workers manesar plant to restart on aug 21
Effects of television on child health  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles