Scientists plot driving routes for new mars rover

Scientists plot driving routes for new Mars rover,National Aeronautics and Space Administration |NASA |Mars rover |Curiosity |car-size rover

Scientists plot driving routes for new Mars rover

Scientist.gif

Posted: 08/16/2012 04:10 PM IST
Scientists plot driving routes for new mars rover

Scientists plot driving routes for new Mars rover

 అరుణ గ్రహం పై జీవాన్వేషణ  లక్ష్యంగా  దిగిన క్యూరియాసిటీ రోవర్.. ఇంకా ఒక్క అడుగు  కూడా ముందుకు వేయలేదు.  అయితే  అంగారకుడి పర్వతం  వద్దకు వెళ్లేందుకు అవకాశం  ఉన్న మార్గాలను  శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు.   గత వారం అంగారకుడి  మధ్య రేఖా ప్రాంతానికి  సమీపంలో  ఉన్న గేల్ బిలం వద్ద దిగిన క్యూరియాసిటీ ఇప్పుడు పూర్తిస్థాయి  ఆరోగ్య  తనిఖీల్లో  నిమగ్నమైంది.  లోగడ  నీటి ప్రవాహానికి  సంబంధించిన  ఆనవాళ్లు  వెలుగు చూసిన షార్ప్  పర్వతానికి 8 కిలోమీటర్ల  దూరంలో రోవర్  దిగింది.  పర్వత దిగువ  ప్రాంతంలోకి  ఇది చేరుకొని,  జీవానికి  సంబంధించిన  రసాయన మూలాలను  అన్వేషించాల్సి ఉంటుంది.  దీని ఆదారంగా  అక్కడి వాతావరణం..  సూక్ష్మ జీవుల  మనుగడకు  అనువైందేనా  అన్నది  నిర్థరించాల్సి  ఉంది. ఈ దిశగా  ఒక కమిటీ కదులుతోంది.  అని నాసా జెట్  ప్రొపల్షన్  లేబొరేటరీ  డిప్యూటీ ప్రాజెక్టు  సైంటిస్టు  అశ్విన్ వాసవాడ  తెలిపారు.  తాను  కాలుమోపిన  ప్రాంతానికి  సంబంధించిన  అనేక ఫొటోలను క్యూరియాసిటీ పంపుతోంది.  కక్ష్యలో  పరిభ్రమిస్తున్న ఉపగ్రహం  కూడా చాలా ఫొటోలు  పంపింది. 

Scientists plot driving routes for new Mars rover

ఈ ప్రాంతమంతా రాళ్లమయంగా  ఉంది. రోవర్ ప్రయాణానికి  ఇబ్బందేమీ లేదు. షార్ప్  పర్వతానికి  చేరువయ్యే కొద్ది  ఉపరితలం  ఎగుడుదిగుడుగా ఉంటుంది.  పర్వతానికి చేరుకోవడానికి  తాము 12 మార్గాలను  గుర్తించాం.  అని అశ్విన్  చెప్పారు.  రోవర్ ... రోజుకు పుట్ బాల్  మైదానమంత  దూరం కదులుతుందని  తెలిపారు.  పర్వత ప్రాంతానికి  చేరుకోవడానికి  ఏడాది  పడుతుందని  వివరించారు.  మధ్య మధ్యలో  అది ఆగుతూ.. అసక్తికరంగా ఉన్న  శిలలపై  ఆద్యయనం  జరుపుతుందని  చెప్పారు.  మట్టిని తవ్వి  పరీక్షిస్తుందని  వివరించారు.  అయితే  అంతకన్నా  ముందు , క్యూరియాసిటీలోని  పరికరాలు  వ్యవస్థల తనిఖీ  ప్రక్రియ  పూర్తికావాల్సి  ఉందని తెలిపారు.  మరో పక్క  క్యూరియాసిటికి మొదట మార్పిడి  విజయవంతంగా  పూర్తయింది.  ఈ సందర్భంగా  రోవర్ లోని ప్రధాన , బ్యాకప్  కంప్యూటర్లకకు కొత్త సాప్ట్ వేర్  ఎక్కించారు.  ఈ ప్రక్రియ  నాలుగు రోజులు  సాగింది.  దీంతో స్పల్ప దూరం పాటు ప్రయోగాత్మకంగా దీన్ని నడిపేందుకు  మార్గం  సుగమమైంది.  మరో వారం రోజుల్లో ఇది  జరుగుతుందని  భావిస్తున్నారు.  కొత్త  సాప్ట్ వేర్  వల్ల అడ్డంకులను అధిగమించే సామర్థ్యం  రోబోటిక్  హస్తాన్ని  ఉపయోగించేందుకు  వీలు కలుగుతుంది. 

Scientists plot driving routes for new Mars rover

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Active noise control quieter cars even when hitting unexpected bumps in the road
Olive oil may help strengthen bones  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles