Nasa mars rover curiosity sends 3d images back to earth

NASA Mars rover Curiosity sends 3D images back to earth ,NASA has released two images from Curiosity's,

NASA Mars rover Curiosity sends 3D images back to earth

Mars.gif

Posted: 08/09/2012 02:52 PM IST
Nasa mars rover curiosity sends 3d images back to earth

NASA Mars rover Curiosity sends 3D images back to earth

అంగారక గ్రహంపై అన్వేషణకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన శోధక నౌక క్యూరియాసిటీ బుధవారం తొలిసారిగా మార్స్ ఉపరితలానికి చెందిన త్రీడీ ఛాయాచిత్రాలను భూమికి పంపించింది. క్యూరియాసిటీ రోవర్‌కు చెందిన కెమెరా వ్యవస్థలను, మార్స్‌పై జీవం ఆనవాళ్ల అన్వేషణ కోసం రోవర్ ఉపయోగించనున్న శాస్త్రీయ పరికరాలను నాసా శాస్త్రవేత్తలు బుధవారం నుంచి పరీక్షించడం ప్రారంభించారు. రోవర్ రోబో చేయిని కదిలించడం ద్వారా ఓ కెమెరాపై పేరుకున్న దుమ్మును విజయవంతంగా దులిపేయగలగడంతో అక్కడి గేల్ క్రేటర్‌కు చెందిన మరింత స్పష్టమైన చిత్రాలను తీసినట్లు నాసా ప్రకటించింది. క్యూరియాసిటీ పంపిన తాజా చిత్రాలనూ విడుదల చేసింది.

NASA Mars rover Curiosity sends 3D images back to earth

అరుణ గ్రహం ఉపరితలంపై రోవర్ దిగిన చోటు, అది ముందుకు సాగిన గుర్తులు, ప్యారాచూట్ కూడా రోవర్ పంపిన ఫొటోల్లో ఉన్నాయి. కాగా, క్యూరియాసిటీ భూమికి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను వెల్లువలా పంపుతోంది. ఆ చిత్రాలన్నింటినీ పరిశీలించడం ద్వారా శాస్త్రవేత్తలు అంగారకుడి ఉపరితలానికి చెందిన విశాల చిత్రాలను రూపొందించనున్నారు. సోమవారం మార్స్‌పై దిగినప్పటి నుంచి భూమికి ఫొటోలు పంపడం ప్రారంభించిన క్యూరియాసిటీ, మంగళవారం కలర్ ఫొటో, వీడియో పంపిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో మరింత నాణ్యమైన వర్ణ చిత్రాలు, విశాల దృశ్యాల చిత్రాలు భూమికి అందనున్నాయి. అణు ఇంధనంతో పనిచేసే క్యూరియాసిటీ రెండేళ్లపాటు సేవలు అందించనుంది.

NASA Mars rover Curiosity sends 3D images back to earth

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramdev says movement is aimed only at black money
Teenage girl hired five contract killers to murder her parents after they opposed her plans to wed married lover  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles