పాకిస్థాన్‌లో అనధికారికంగా ప్రసారం అవుతున్న కొన్ని భారత చానెళ్లపై నిషేధం విధించాలని ఆ దేశ రక్షణ శాఖ అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వాటిలో ప్రసారమవుతున్న కార్యక్రమాల్లో పాకిస్థాన్‌ను, దేశ సంస్కృతిని చెడుగా చూపుతున్నాయని ఆరోపించింది. అయితే.. ఇదంతా ఇప్పుడే కాదు! ఇప్పటికే మూడేళ్లలో ఇలా రెండు సార్లు ప్రభుత్వాన్ని కోరగా.. ఈ సారి మాత్రం తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు 'పాకిస్థాన్‌కు, దేశ సంస్థలకు వ్యతిరేకంగా భారత్ అనుసరిస్తున్న ఎజెండాను పలు చానెళ్లు ప్రసారం చేస్తున్నాయి. ముఖ్యంగా యువతరాన్ని, పాక్ సంస్కృతిని లక్ష్యంగా చేసుకున్నాయి. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిషేధించాల'ని పేర్కొంటూ.. ఆ దేశ మీడియా నియంత్రణ సంస్థ, సమాచార శాఖలకు లేఖలు రాసింది. మరోవైపు.. లష్కరేతాయిబాతో దక్షిణాసియా దేశాలకు పెను ముప్పు పొంచి ఉందని, ఇన్నేళ్లుగా నియంత్రణ చర్యలు చేపడుతున్నా ఆ ఉగ్రవాద సంస్థ ఏ మాత్రం బలహీన పడలేదని అమెరికా స్పష్టం చేసింది.
లష్కరేను నియంత్రించడానికి మరిన్ని చర్యలు చేపట్టాలని పాకిస్థాన్‌కు సూచించింది. ఈ ఏటి 'వార్షిక ఉగ్రవాద నివేదిక' విడుదల సందర్భంగా అమెరికా ఉగ్రవాద నిరోధక విభాగం కో ఆర్డినేటర్ డేనియల్ బెంజిమన్ మాట్లాడారు. "దక్షిణాసియాలో లష్కరేతాయిబా ఏ మాత్రం బలహీన పడలేదు. దాని వల్ల ఆ ప్రాంత దేశాలకు పెను ముప్పు పొంచి ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అందువల్ల ఆ ఉగ్రవాద సంస్థను అణచివేయడానికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిందిగా పాకిస్థాన్‌ను కోరుతున్నాం'' అని ఆయన పేర్కొన్నారు. ముంబై మారణకాండపై విచారణ మరింత వేగంగా సాగాల్సి ఉందని, అందుకు పాక్ సహకరించాలని బెంజమన్ చెప్పారు. కాగా.. పాకిస్థాన్‌లో మరింత విస్తృతంగా దాడులు చేయాలని తాలిబాన్ ఉగ్రవాద సంస్థ నిర్ణయించింది. నిఘా వర్గాలను ఉటంకిస్తూ అక్కడ ఎక్స్‌ప్రెస్ ట్రబ్యున్ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలోని మిలటరీ, నిఘా సంస్థలు, వైమానిక దళ స్థావరాలపై దాడులు చేయాలని, వీలైనంత ఎక్కువ నష్టం కలిగించాలని ఉగ్రవాదులకు తాలిబాన్ చీఫ్ హకీముల్లా మసూద్ సూచించారని పేర్కొంది.
ముంబై మారణకాండకు సంబంధించి సాక్షులను పాకిస్థాన్ జుడిషియల్ కమిషన్ ప్రశ్నించేందుకు ప్రభుత్వం అంగీకరించే అవకాశం కనిపిస్తోంది. పాకిస్థాన్‌లో ఉన్న ముష్కరులను శిక్షించాలని భారత్ గట్టిగా కోరుకుంటోందని, ఈ మేరకు సాక్షులను ప్రశ్నిస్తామన్న పాక్ విజ్ఞప్తికి అంగీకరించే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్‌కే సింగ్ తెలిపారు. "వారిని ఏ విధంగా ప్రశ్నించాలనుకుంటున్నారని పాక్‌ను అడిగాం. వారు చెప్పేదానిని బట్టి.. సాధ్యాసాధ్యాలపై న్యాయవిభాగాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం'' అని ఆయన పేర్కొన్నారు. ఆ దాడులకు సంబంధించి లష్కరే చీఫ్ జకీవుర్ రెహ్మన్ లక్వీ సహా ఏడుగురికి పాత్ర ఉన్నట్లుగా పాకిస్థాన్‌కు భారత్ ఆధారాలు అందజేసిన సంగతి తెలిసిందే. అయితే.. గత మార్చిలో పాక్ జ్యుడిషియల్ కమిషన్ ముంబైలో పర్యటించినప్పుడు.. ఘటనను విచారిస్తున్న భారత అధికారులను ప్రశ్నిస్తామని కోరింది. కానీ, భారత్ అంగీకరించలేదు. దాంతో వారిని ప్రశ్నించేవరకు భారత్ అందజేసిన ఆధారాలకు.. తమ కోర్టుల్లో విలువ ఉండదని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more