Dharmana kamiti review

dharmana kamiti review

dharmana kamiti review

19.gif

Posted: 07/27/2012 01:36 PM IST
Dharmana kamiti review

       మంత్రుల కమిటీ సిఫారసుల సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. సిఫారసులను ఏ మేరకు అమలు చేయవచ్చో పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు న్యాయపరమైన అవరోధాలను అధిగమించాలని dharmanaసూచించారు. అయితే మంత్రుల కమిటీపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయినాకానీ పార్టీ పటిష్టత కోసం మంత్రి ధర్మాన నేతృత్వంలోని కమిటీ సిఫార్సులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టి సారించారు. కమిటీ ప్రభుత్వానికి  చేసిన 34 సిఫారసులపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎం సమాలోచనలు చేసారు. నివేదికలోని కీలక సిఫారసులను అధ్యయనం చేసి సాధ్యమయ్యే పరిష్కారాలను సూచించాలని ఆదేశించారు. దీనిపై తనకు నివేదిక ఇవ్వాలని కోరారు.
      స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేక పోవడంతో స్థానికంగా పార్టీ బలహీనమైందని కమిటీ చేసిన సూచనతో సీఎం ఏకీభవించారు. వెంటనే ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా ఉన్న dhar_manaన్యాయపరమైన అవరోధాలను అధిగమించాలని  చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకం అందరికి వర్తించేలా చొరవ చూపాలని చేసిన సిఫారసును పరిశీలించాలని ఆదేశించారు. ఇక పార్టీకి దూరమైన బీసీ వర్గాలను ఆకట్టుకునేలా కుల వృత్తుల కార్పొరేషన్లను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. మంత్రుల కమిటీ తీరుపై పార్టీ సీనియర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. తప్పులు చేసిన వారికి తప్పులు సరిదిద్దే బాధ్యత ఎలా ఇస్తారని ప్రశ్నలుసంధిస్తున్నారు. అసలు పార్టీ, ప్రభుత్వంలో ప్రక్షాలన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సూచించిన సిఫారసులను ప్రభుత్వం అమలు చేసేందుకు నడుం బిగించడంతో ఇక పార్టీకి సూచించిన 17 అంశాలను అమలు చేసేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bv reddy passed away
Cm kiran indiramma bata in srikakulam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles