Bv reddy passed away

bv reddy passed away

bv reddy passed away

21.gif

Posted: 07/27/2012 03:05 PM IST
Bv reddy passed away

        బీవీ రెడ్డి ఇవాళ పరమపదించారు. తెలుగు దేశం సీనియర్‌ నేత, ప్రముఖ జ్యోతిష్కుడుగా పేరొందిన మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నఆయన ఆస్పత్రిలో చికిత్స bv_reddyపొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.  బీవీ మోహన్‌ రెడ్డిగా సుపరిచితుడైన బైరెడ్డి విశ్వమోహన్‌ రెడ్డి కర్నూలు జిల్లా ఉల్లిందగొండలో నవంబర్‌ 2 1945లో జన్మించారు. బాలిరెడ్డి , వెంకటరంగమ్మ దంపతులకు ఏకైక కుమారుడు బీవీ మోహన్‌ రెడ్డి. 1963వ సంవత్సరంలో కర్నూలు మునిసిపల్‌ హైస్కూల్‌లో ఎస్ఎస్ఎల్ సీ పూర్తి చేశారు. మొదటి నుంచి వీరి కుటుంబం రాజకీయాల్లో ఉన్నప్పటికీ..బీవీ మోహన్‌ రెడ్డి ఎదుగుదలతోనే రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదిగింది. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి వరుసగా అయిదు సార్లు గెలిచి తన సత్తా చాటారు. పలు కీలక మంత్రిత్వ శాఖలను చేపట్టి తనదైన శైలిలో ముందుకు సాగారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఆరోగ్యం బాగాలేకపోయినప్పటికీ వీల్‌చైర్‌ మీద నుంచి ప్రచారం చేశారు. చెన్నకేశవరెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీవీ మోహన్‌ రెడ్డికి ఒక కూమారుడు ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఆపార్టీనేతలు రెడ్డి కుటుంభసభ్యులకు తమ సానుభూతిని ప్రకటించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Psycho activity in west godavari district
Dharmana kamiti review  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles