Chandrababu suspended

Chandrababu Suspended,TDP MLA Hariswara Reddy,Parigi MLA Hariswar Reddy,Nuzvid MLA Chinnam Rama Kotaiah,Mantralayam MLA Bala Nagi Reddy,

Chandrababu Suspended

Chandrababu.gif

Posted: 07/25/2012 11:20 AM IST
Chandrababu suspended

Chandrababu Suspended

తెలంగాణకు ప్రధాన అడ్డంకి టీడీపీ అధినేత చంద్రబాబేనని ఆ పార్టీ నుంచి సస్పెన్షన్‌కుగురైన ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు.రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వంద స్థానాలను కేటాయిస్తామంటూ బీసీలపై ప్రేమ ఒలకపోస్తున్న చంద్రబాబుకు అధికారంలో ఉన్నంత కాలం వారు ఎందుకు గుర్తుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. బీసీలను, రైతులను మంచి చేసుకునేందుకే చంద్రబాబు వారిపై కపట ప్రేమ చూపుతున్నారని అన్నారు.యాకుత్‌పురా, చంద్రాయణగుట్ట వంటి గెలవలేని స్థానాలను బీసీలకు ఇస్తారనీ, అటువంటి స్థానాలను ఇచ్చి లాభమేటని ఆయన ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించలేకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణపై కేంద్ర హోంమంత్రి ప్రకటన వెలువడిన తరువాత రాత్రికి రాత్రే అప్పటి సీఎం రోశయ్యతో మాట్లాడి అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెట్టనీయకుండా చేసింది చంద్రబాబేనని ఆయన చెప్పారు.

తెలంగాణ పట్ల చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ తాను రెండేళ్ల కిందటనే తాను టీడీపీ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసి రసీదు కూడా తీసుకున్నానని హరీశ్వర్‌రెడ్డి చెప్పారు. ఆ విధంగా తానే ముందుగా టీడీపీని, చంద్రబాబును సస్పెండ్ చేశానని, అలాంటప్పుడు ఇప్పుడు తనను టీడీపీ సస్పెండ్ చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. 1983లో తాను టీడీపీ నుంచి, చంద్రబాబు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపాయామని, ఆ తరువాతనే చంద్రబాబుటీడీపీలోకి వచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు టీడీపీ పరిస్థితి మునిగిపోయే నావలా ఉందని, అలాంటి పార్టీ నుంచి టిక్కెట్ ఎవరు కోరుకుంటారని ఆయన ప్రశ్నించారు.చంద్రబాబు తెలంగాణకు పూర్తిగా వ్యతిరేకమని, అడుగడుగునా ఆయన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు మోకాలడ్డుతున్న విషయాన్ని ఇప్పటికైనా ఆ పార్టీ తెలంగాణ ఫోరం నాయకులు గుర్తించి, టీడీపీ నుంచి బయటకు రావాలన్నారు. చేనేత దీక్ష చేసేందుకు సిరిసిల్లకు వచ్చిన వైఎస్ విజయలక్ష్మిని అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు. ఎవరికైనా ఎక్కడైనా తిరిగే హక్కు ఉంటుందని, అడ్డుకోవడం వంటి చర్యల వలన వైసీపీకే ప్రయోజనం కలుగుతుందన్నారు. తెలంగాణ నగారా ఒక ఉద్యమ సంస్థ అని, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranab mukherjee takes oath as 13 president
Forks over knives  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles