Forks over knives

Forks Over Knives,American documentary film directed by Lee Fulkerson,

Forks Over Knives

Forks.gif

Posted: 07/25/2012 11:14 AM IST
Forks over knives

Forks Over Knives

'ఫోర్క్స్ ఓవర్ నైవ్స్' -ఇదొక 90 నిమిషాల నిడివి గల చిన్న సినిమా. ఇప్పుడు దీనిని చూడటానికి అమెరికాలో జనం ఎగబడుతున్నారు. గతేడాది ఆగస్టులో అక్కడి మల్టీప్లెక్స్‌ల్లో ఒక రోజో, రెండు రోజులో ఆడి వెళ్లిపోయింది. ఆ రోజుల్లో దాదాపుగా ఎవరి దృష్టిలోనూ పడని ఈ సినిమా మీద నేడు అందరి దృష్టి పడింది.నాలుగేళ్ల క్రితం సంగతి... అమెరికాలో రియల్ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్న బ్రియాన్ వెండల్ అనే ఆసామి డాక్టర్ కాంప్‌బెల్ రాసిన ఒక పుస్తకాన్ని చదివాడు. ఆకుకూరలు, కాయగూరల వలన కలిగే ఉపయోగాలేమిటో అందులో రాసి ఉంది. వాటి వలన శరీరానికి చేకూరే లాభాలే కాకుండా వాటిని ఆహారంగా తీసుకోవడం వలన దేహంలోని వివిధ రుగ్మతలను ఎలా తగ్గించుకోవచ్చో ఆధారాలతో సహా కాంప్‌బెల్ ఆ పుస్తకంలో వివరించారు. ఆ సమాచారం వెండల్‌ను బాగా ఆకట్టుకుంది.

రీసెర్చ్ రీసెర్చ్... కాంప్‌బెల్ రాసిన పుస్తకాన్ని సినిమాగా తెరకెక్కించాలని వెండల్ నిర్ణయించుకున్నాడు. దాన్ని కేవలం కాంప్‌బెల్ మాటలతో నింపేయకుండా అమెరికా ఆహారంలో వచ్చిన మార్పులను వివరించాలనుకున్నాడు. అందుకనుగుణంగా 1950 నుంచి అమెరికాలో వచ్చిన ఆహారపు అలవాట్లను, అప్పటి రోగాల వివరాలను సేకరించాడు. కేస్ స్టడీలు చేశాడు.సినిమా మానిసి... ఒక వైపు కాంప్‌బెల్ నడుస్తూనే ఇంకోవైపు ఈ కేస్‌స్టడీల వివరాలన్నీ వస్తుంటాయి సినిమాలో. దీని ద్వారా జంక్ ఫుడ్ రానంతవరకు అమెరికన్స్ డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, కిడ్నీ జబ్బులకు ఎలా దూరంగా ఉండేవారన్న విషయాన్ని నిరూపించాడు. ఇంకో వైపు ఆకుకూరలు, కూరగాయలు తినడం వల్ల సహజ సిద్ధంగా చేకూరే మేలును కాంప్‌బెల్‌తో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. వాస్తవ విషయాలతో రూపొందడంతో ఫోర్క్స్ ఓవర్ నైవ్స్‌కు అంత డిమాండ్ ఏర్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu suspended
Indian american teacher heads to jail for romance with minor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles