Girls as young as six want to be sexy shocking study finds

Girls as young as SIX want to be 'sexy', shocking study finds

Girls as young as SIX want to be 'sexy', shocking study finds

Girls.gif

Posted: 07/19/2012 01:47 PM IST
Girls as young as six want to be sexy shocking study finds

Girls as young as SIX want to be 'sexy', shocking study finds

 ముక్కుపచ్చలారని బాలికలు. ముద్దులొలికే చిన్నారులు. మనసులోకి కల్మషం చేరని బుడతలు. ఇవన్నీ ఆరు సంవత్సరాల బాలికల గురించి చెప్పుకుంటున్న నిజాలు. ఇది గతం. కాల చక్రం వేగం పుంజుకుందిగా! వారూ మార్పులకు అతీతంగా ఉండలేకపోతున్నారు. పెద్దవారి కల్మషం వారికీ అంటుకుంటోంది. ఆరు సంవత్సరాలకే సెక్సీగా కనిపించాలని ఈ వయసు బాలికలు ఆరాటపడిపోతున్నారు. అమెరికాలోని ఎలిమెంటరీ స్కూల్ బాలికల్లో ఈ విధమైన ధోరణి కనబడుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పటి వరకూ టీనేజీ బాలికల్లో.. అంతకంటే పెద్దవారైన యువతలు, మహిళల్లో మాత్రమే సెక్సీగా కనిపించాలనే ఆరాటం ఉండేది. కానీ, మొదటిసారిగా.. శృంగారపరమైన భావన చిన్నారుల్లోనూ వ్యక్తమవుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన కాక్స్ కాలేజీ మనస్తత్వ నిపుణులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఆరు నుంచి తొమ్మిది సంవత్సరాల్లోపు బాలికలను కొంత మందిని ఎంచుకొని.. వారికి పేపర్ బొమ్మలను అందించారు. 60బాలికలు.. ఒక్కో బాలిక రెండు బొమ్మలను చక్కగా ముస్తాబు చేశారు. వాటిలో ఓ బొమ్మకు బిగుతైన దుస్తులు వేశారు. అంటే చూడగానే సెక్సీగా కనిపించేలా అలంకరించారు.

Girls as young as SIX want to be 'sexy', shocking study finds

ఇక రెండో బొమ్మకు మాత్రం ఆధునిక తరహా దుస్తులే వేసినప్పటికీ అవి మాత్రం కొంచెం సంప్రదాయ బద్దంగా ఉన్నాయి. ఇక శాస్త్రవేత్తలు అడిగే ఒక్కో ప్రశ్నకు వారు ఒక్కో బొమ్మను చూపించారు. "మీరు ఎలా కనిపించాలని కోరుకుంటున్నారు?'' అన్న ప్రశ్నకు ఆ బాలికలు చురుగ్గా స్పందించారు. అధికశాతం మంది సెక్సీగా ఉన్న బొమ్మలను చూపించారు. మొత్తం 72శాతం మంది సెక్సీ బొమ్మకే ఓటేశారు. "బాలికలు సెక్సీగా కనిపించాలని కోరుకోవడం సాధారణమే. ఎందుకంటే అలా ఉంటేనే ప్రజాదరణ వస్తుందని వారి విశ్వాసం'' అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన పరిశోధకుడు క్రిస్టిస్టార్ వివరించారు. అయితే, మరీ ఆరు సంవత్సరాలకే వారిలో ఆ భావన మొలకెత్తుతుందని తెలిసిన పరిశోధకుల మొహాలు ఆశ్చర్యంతో తెల్లబోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ou campus in tense once again
The superstar laid to rest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles