Laila khan murder a family vacation that turned tragic

Laila Khan murder: a family vacation that turned tragic,lailakhan murder, assets of lilakhan, bollywood, parvez tak stepfather, mumbaipolice, crime murder mystery, nasik murders, mumbai police drime branch, laila khan family disputes, skulls, bones, skeletons

Laila Khan murder: a family vacation that turned tragic

Laila.gif

Posted: 07/12/2012 01:52 PM IST
Laila khan murder a family vacation that turned tragic

Laila Khan murder: a family vacation that turned tragic

 పాకిస్థాన్‌కు చెందిన బాలీవుడ్ వర్ధమాన నటి లైలాఖాన్‌ను, ఆమె కుటుంబానికి చెందిన ఐదుగురిని తానే హత్య చేశానని ఆమె సవతి తండ్రి పర్వేజ్ తాక్ ఒప్పుకున్నాడు. ఆస్తిపై ఆశతోపాటు, లైలా తల్లి షెలీనా రెండో భర్తకు దగ్గరవడం సహించలేకే లైలా కుటుంబాన్ని హతమార్చానన్నాడు. క్రైం సినిమాను తలపించే ఈ ఉదంతం వివరాలను ముంబై పోలీసులు బుధవారం వెల్లడించారు. మరోపక్క.. నాసిక్ దగ్గర్లోని ఇగత్‌పురిలో తాక్ హత్యలకు పాల్పడిన ఫామ్‌హౌస్ వద్ద షెలీనా, ఆమె కుంటుంబ సభ్యులవిగా భావిస్తున్న ఆరు అస్థిపంజరాలను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.  ఫాం హౌస్‌లో దారుణం..: తాక్ పోలీసుల విచారణలో వెల్లడించిన వివరాలను ముంబై పోలీస్ క్రైం బ్రాంచ్ చీఫ్ హిమాంశురాయ్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఆ వివరాలు.. లైలాఖాన్ తల్లి షెలీనాకు తాక్ మూడో భర్త. తాక్ జమ్మూ కాశ్మీర్‌లోని కిస్తెవార్‌లో అటవీ కాంట్రాక్టర్. షెలీనా రెండో భర్త అసిఫ్ షేక్. సెలీనా..అసిఫ్‌తో తన ఆస్తివివరాలు చెబుతూ సన్నిహితంగా ఉండేది. అతని పేరిట పవర్ ఆఫ్ అటార్నీ కూడా సిద్ధం చేసింది.

దీంతో తాక్ ఆమెతో గొడవపడేవాడు. లైలా కుటుంబం భారత్‌లోని ఆస్తులు అమ్ముకుని దుబాయ్‌కి వెళ్లాలని తీసుకున్న నిర్ణయమూ అతనికి నచ్చలేదు. తాక్‌కు పాస్‌పోర్ట్ లేకపోవడం దీనికి కారణం. తాను ఒంటరినైపోతున్నానని అతడు భావించాడు. గత ఏడాది ఫిబ్రవరిలో లైలా, ఆమె కుటుంబ సభ్యులు ఇగత్‌పురిలోని ఫాంహౌస్‌కు వచ్చారు. ఆ నెల 7న రాత్రి తాక్, షెలీనా తీవ్రంగా వాదించుకున్నారు. తాక్ షెలీనాను ఓ వస్తువుతో బలంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. దీంతో అక్కడే ఉన్న లైలాఖాన్ (30) ఆమె అక్క అజ్మీనా (32), చెల్లెలు జారా, సోదరుడు ఇమ్రాన్(25), దగ్గరి బంధువు రేష్మాలు మొదటి అంతస్తునుంచి కిందికి పరిగెత్తారు.వారు తన నేరానికి సాక్షులవుతారని భావించిన తాక్.. తన సొంత ఊరి వాడైన వాచ్‌మెన్ షాకిర్ హుస్సేన్ వనీతో కలిసి వారినందరినీ ఇనుప రాడ్లతో మోది చంపేశాడు. ఇమ్రాన్‌ను తలపై మోది చంపారు. ఘటనలో తాక్‌కు కూడా గాయాలయ్యాయి. సాక్ష్యాలను నాశనం చేసేందుకు తాక్, వనీలు ఫాం హౌస్‌కు నిప్పుపెట్టారు. తర్వాత ఇద్దరూ లైలాఖాన్‌కు చెందిన వాహనంలో జమ్మూకు పారిపోయారు. దారి మధ్యలో ముంబైలోని లైలా ఇంటిని శుభ్రం చేశారు. తర్వాత లైలాఖాన్ కుటుంబం దుబాయ్‌కు వెళ్లిందని తాక్ తెలిసిన వారికి చెప్పాడు. గత నెలలో పోలీసులు తాక్‌ను ఫోర్జరీ కేసులో అరెస్టు చేశారు. దీంతో లైలాఖాన్, ఆమె కుటుంబ సభ్యుల హత్యలు వెలుగు చూశాయి.

Laila Khan murder: a family vacation that turned tragic

షెలీనాతో గొడవ పడి క్షణికావేశంలో నేరానికి పాల్పడ్డాడని తాక్ చెబుతున్నదాంట్లో నిజమెంతో ఇప్పటికిప్పుడు చెప్పలేమని పోలీసులు పేర్కొన్నారు. తాక్‌కు లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నట్లు వారు అనుమానిస్తున్నారు. ఈ కేసులో షెలీనా రెండో భర్త అసిఫ్‌ను కూడా పోలీసులు గతంలో అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో అదృశ్యమైన లైలాఖాన్ కుటుంబాన్ని దుండగులు హత్య చేశారని తాక్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.  ముంబై పోలీసులు ఇగత్‌పురి ఫాం హౌస్ పరిసరాల్లో మంగళవారం స్వాధీనం చేసుకున్న ఆరు అస్థిపంజరాల్లో ఒకటి పురుషుడిదని, మిగిలినవి మహిళలవి. వీటిలో మూడు ఓ సెప్టిక్ ట్యాంక్‌లో, మరో మూడు ఫాం హౌస్ దగ్గర దొరికాయి. తాక్ చెప్పిన వివరాల ఆధారంగా ఇవి లైలాఖాన్, ఆమె కుంటుంబ సభ్యులవి కావచ్చని భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. నిర్ధారణ కోసం డీఎన్‌ఏ శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామన్నారు. శవాల వద్ద కత్తి, ఆభరణాలు, దిండు, బెడ్‌షీట్లులభించాయన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Belfast council puts lennox to sleep despite outcry
Dara singh passes away after prolonged illness  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles