Tdp ntr kodalinani political drama

tdp ntr kodalinani political drama

tdp ntr kodalinani political drama

24.gif

Posted: 07/11/2012 05:39 PM IST
Tdp ntr kodalinani political drama

      kodali4టిడిపిలో సంక్షోభం ముదురుతోంది. కృష్ణా జిల్లా  టిడిపిలో వలసలు మొదలయ్యాయి. వైఎస్సార్ సీపీలోకి కొడాలి నానితో మొదలైన వలసలకు, పొలిట్  బ్యూరో సభ్యురాలు కల్పన కూడా జతకలిసారు. నాని, కల్పనల నిష్క్రమణతో ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు నాని నిష్క్రమణతో  భగ్గమంటున్నాయి. ఆధిపత్య పోరుతో జిల్లాలో కోలుకోలేని స్థితికి చేరుకున్న టిడిపికి మున్ముందు గడ్డు పరిస్థితి తప్పకపోవచ్చు. నానితో పాటు కృష్ణాలో మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ లోకి జంప్ చేయడానికి సిద్ధంగా ఉండటంతో టిడిపిలో ఏం జరుగుతుందో అర్థం కాని స్థితి నెలకొంది.
       ఇదిలా ఉంటే, అసలు కొడాలి నాని ఎందుకు పార్టీ వీడారు. మూడు నెలల నుంచి సాగుతున్నా, ఎందుకు ఆలస్యమైంది. నాని ఎపిసోడ్ కు స్క్రీన్ ప్లే ఎవరిది. నానిని విమర్శించేందుకు జూనియర్ ఎందుకు ఇష్టపడటం లేదు..? టిడిపిలో నానికి ఏం kodali_1కష్టమొచ్చిందోనంటూ ఎన్టీఆర్  సన్నాయి నొక్కుల వెనుక అర్థం ఏంటి...? ఇవీ అందరి మదిలో మెదులుతోన్న ప్రశ్నల పరంపర. అయితే.  ఈ సందేహాలను అర్థం చేసుకోడానిక పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు ఓ వైపు.....2014 ఎన్నికల కోసం  గుడివాడ స్థానంపై బాలయ్య కన్నేయడంతో నానికి ప్రత్యామ్నయం అవసరమైంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమాతో విబేధాలు  నానిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.
      మరోవైపు కృష్ణా జిల్లాలో బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాని వైఎస్సార్  కాంగ్రెస్ లో చేరడాన్ని టిడిపికి జీర్ణం కావడం లేదు. ఇది ఖచ్చితంగా టిడిపిని ఇబ్బంది పెట్టే పరిణామమే. నిజానికి మూడు నెలల క్రితమే వంగవీటి రాధాతో పాటు కొడాలి నాని కూడా వైఎస్సార్  కాంగ్రెస్ లో చేరాల్సి ఉన్నా టిడిపి వ్యవస్థాపక కుటుంబానికి చెందిన అదృశ్య హస్తమొకటి నానిని ఆపింది. మూడు నెలలు వేచి ఉండాలంటూ సర్ది చెప్పడంతోనే నాని ఓపికపడుతూ వచ్చారు. ఇక రెండుసార్లు టిడిపి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాని మొదట్నుంచి వైఎస్ కు అభిమానిని చెప్పుకుంటూనే ఉన్నారు. మొబైల్ ఫోన్లో వైఎస్ ఫోటోను స్క్రీన్ సేవర్ గా పెట్టుకోవడంపై సహచరులతో వాదులాటకు దిగిన సందర్భాలను మిత్రులు గుర్తు చేసుకుంటున్నారు.
      నాని ఎపిసోడ్ లో విస్మరించకూడని మరో అంశం. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం జూనియర్ ను విస్మరించిన రోజుల్లోనే కొడాలి నాని జూనియర్  కు అండగా నిలబడ్డారు. గుడివాడలో జూనియర్  విద్యాభ్యాసం జరగడానికి ఇదే ప్రధాన కారణం హైస్కూల్  విద్యాభ్యాసం వరకు కేర్ టేకర్ గా kodali_2వ్యవహరించిన నాని పట్ల జూనియర్  కూడా అంతే అభిమానం చూపించారు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కాల్షీట్ల నుంచి  ఎన్నికల్లో ప్రచారం వరకు జూనియర్ ను కొడాలి నాని వెన్నంటే ఉన్నారు. ఓ దశలో జూనియర్ కాల్షీట్లు మొత్తం గుంపగుత్తుగా నానికే కట్టబెట్టే వారనే ప్రచారం కూడా ఉంది. 2004, 2009 ఎన్నికల్లో హరికృష్ణ, జూనియర్  ఎన్టీఆర్ ల ఒత్తిడితోనే సీనియర్  నేత వడ్డే శోభనాద్రిని కాదని నానికి  బాబు టిక్కెట్ ను కేటాయించారు. అలాంటి నాని భవిష్యత్తును నిర్ణయించే కీలక నిర్ణయం జూనియర్ కు తెలీకుండా జరిగే పనేనా..?నాని వ్యవహారంతో సంబంధం లేదంటోన్న జూనియర్  కూడా పల్లెత్తు మాట అనకపోవడానికి ఇదే కారణమా నాని సస్పెన్షన్  తర్వాత జూనియర్  మాటల్లో అంతరార్ధం ఏమిటి.
      కొడాలి నానికి ఎందుకంత ప్రాధాన్యత రాజకీయాల్లో వలసలు ఫిరాయింపులు సహజమే అయినా గుడివాడ స్థానం విషయంలోనే ఎందుకింత చర్చ జరుగుతోంది. కారణం ఒక్కటే గుడివాడ టిడిపి kodali_3వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక  రామారావు సొంత నియోజకవర్గం. టిడిపి ఆవిర్భావించిన తర్వాత తొమ్మిది సార్లు  ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు టిడిపి అభ్యర్ధులే గెలుపొందారు. ఇక బందరు పార్లమెంటరీ నియోజక వర్గంలో అభ్యర్ధుల గెలుపొటముల్ని నిర్ణయించేది ఈ స్థానమే అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా గుడివాడపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నానిని వైఎస్సార్ సీపీలోకి రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. దీని కోసం ఆరేడు నెలలుగా భారీ కసరత్తే జరిగింది. గుడివాడలో ఉప ఎన్నికలు వచ్చి అక్కడ్నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్ధి గెలుపొందితే కోస్తాలో టిడిపి కోలుకోవడం కష్టం. అందుకే నాని వ్యవహారంలో ఇంత రాద్ధాంతం జరుగుతోంది.
     నానితో దెబ్బతిన్న కృష్ణాజిల్లాలో టిడిపికి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన టిడిపిని వీడటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పామర్రు నియోజక వర్గం నుంచి పోటీ చేసిన కల్పన కాంగ్రెస్ అభ్యర్ధి డివై.దాస్ చేతిలో ఓడిపోయారు.  గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై సస్పెన్షన్  వేటు పడిన మర్నాడే కల్పన వైఎస్సార్ సీపీలో కీలక నేత మేకపాటి రాజమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. మేకపాటితో కల్పన భేటీ అయిన కొద్దిసేపటికే టిడిపి ఆమెపై సస్పెన్షన్  వేటు వేసింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కల్పన పొలిట్  బ్యూరో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. మొత్తం మీద కృష్ణజిల్లా రాజకీయాల్ని నానీ వ్యవహారం మలుపు తిప్పిబోతుందేమో అని అందరిలోనూ ఆసక్తి కలుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli shock to chiru
Tara chowdary filed a petition  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles