Rajamouli shock to chiru

Rajamouli Shock to Chiru. is no ready to do direct chiru's 150th movie.Directing Chiru's 150th film is an adventure.I am not ready to do this says Rajamouli.

Rajamouli Shock to Chiru. is no ready to do direct chiru's 150th movie.Directing Chiru's 150th film is an adventure.I am not ready to do this says Rajamouli.

Rajamouli Shock to Chiru.gif

Posted: 07/11/2012 06:59 PM IST
Rajamouli shock to chiru

Rajamouliమెగాస్టార్ చిరంజీవి ఆశల పై ప్రముఖ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి నీళ్ళు చల్లాడు. పీఆర్పీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత చిరంజీవి తన 150వ చిత్రం పూర్తి చేస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. ఇక చిరంజీవి ఏ ఆడియో ఫంక్షన్ కి వెళ్ళినా టైం వచ్చినప్పుడు ఖఛ్చితంగా తన 150 వ చిత్రం పూర్తి చేస్తానని అంటున్నారు. అదేకాకుండా గతంలో ప్రముఖ డైరెక్టర్ శంకర్ అవకాశం ఇస్తే నటిస్తానని, వివి వినాయక్, రాజమౌళి లాంటి వాళ్ళ దర్శకత్వంలో చేస్తే బాగుంటుందని వివిధ సందర్భల్లో వివిధ రకాలుగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. కానీ ఇవాళ రాజమౌళి తన మనస్సులోని మాటను బయట పెట్టాడు.

ఈగ సినిమా విజయోత్సవ ప్రచారంలో భాగంగా వరంగల్ కి వెళ్లిన ఆయన మాట్లాడుతూ... తాను మెగాస్టార్ లాంటి పెద్ద వాళ్ళ సినిమాలకు డైరెక్షన్ చేయనని, ఒకవేళ చిరంజీవి అడిగితే ఆ సినిమాకి స్క్రిప్టు అందిస్తానని అన్నారు. భవిష్యత్ లో నాని వంటి చిన్న హీరోలతోనే సినిమాలు తీస్తానని చెప్పారు. ఒక రకంగా చూస్తే చిరంజీవికి రాజమౌళి మంచి జలక్ ఇచ్చాడనే చెప్పవచ్చు. ఈగ చిత్రంలో నటించిన సుదీప్, తాగుబోతు రమేష్ తోపాటు రాజమౌళి అభిమానులను ఆలరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A p j abdul kalam joins facebook
Tdp ntr kodalinani political drama  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles