Tdp bc strategy

tdp bc strategy

tdp bc strategy

20.gif

Posted: 07/10/2012 08:05 PM IST
Tdp bc strategy

      రాబోయే సాధారణ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల(బిసి)కు వంద శాసన సభ స్థానాలు కేటాయించాలని ప్రతిపక్ష టిడిపి నిర్ణయించింది. babuబిసిల అభివృద్ధి, సంక్షేమం కోసం జాతీయస్థాయిలో ఉద్యమం చేపడతామని ప్రకటించింది. పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో సోమ వారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సమావేశం బిసి సంక్షేమం, అభివృద్ధిపై మేథోమథనం జరిపింది. మేథోమథన సమావేశం ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. ఈ అంశాన్ని పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు స్వయంగా సమా వేశంలో ప్రకటించారు. బిసి సంక్షేమం పట్ల టిడిపి చిత్తశుద్ధిని శంకించనవసరం లేదని ఆయన చెప్పారు. మేథోమథనంలో ఆయన ప్రారంభ, ముగింపు ప్రసంగం చేశారు.2009లో బిసిలకు వంద సీట్లు కేటాయిస్తామని చెప్పి ఇవ్వలేకపోయా మన్నారు. నాడు మహా కూటమికి 73 స్థానాలు కేటాయించినందున ఇబ్బంది కల్గిందన్నారు. బిసి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఇప్పుడే ప్రారంభిస్తామ న్నారు. 2013లోనే అభ్యర్థులను ప్రకటిస్తామ న్నారు. గెలుపు అవకాశం ఉన్నవారందరికీ టికెట్లు తప్పకుండా ఇస్తామన్నారు. టికెట్లు రాని వారు అసంతృప్తి చెందనవసరం లేదన్నారు. వారిని నామి నేటెడ్‌ పదవులతో సంతృప్తిపరచగలమని చంద్ర బాబు ప్రకటించారు. అన్ని నామినేటెడ్‌ పదవుల్లో 33 శాతం రిజర్వేషన్‌ ఉండేలా చర్యలు తీసుకుంటా మని చెప్పారు. బిసిలకు ప్రత్యేక ఉప ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. టీడీపీ నే కాదు ఇతర పార్టీలు సైతం బిసి ఓట్లకోసం యడతెగని మంతనాలు చర్చలు సాగిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vizag sea surprise
Osama was addicted to sunny leone videos  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles