Mexico country new president

mexico country new president

mexico country new president

19.gif

Posted: 07/08/2012 06:55 PM IST
Mexico country new president

       మెక్సికో అధ్యక్ష ఎన్నికల్లో పెనా నీటో ఘన విజయం సాధించినట్లు ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించారు. అయితే పిఆర్ ఐ పార్టీ అక్రమాలకు పాల్పడిందంటూ అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపుపై వామపక్ష అభ్యర్ధి మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడార్ కోర్టులో పిటిషన్ దాఖలు mexico_presiచేయటంతో ఈ లెక్కింపు ప్రక్రియ అనిశ్చితిలో పడింది. ఈ ఓట్ల కొనుగోలు ఆరోపణలు గత నెలలోనే వెలుగులోకి వచ్చినప్పటికీ పిఆర్ ఐ పార్టీ మద్దతుదారులు అందించారంటూ 100పిసోలు విలువైన ప్రిపెయిడ్ గిఫ్ట్  కార్డులను సొమ్ము చేసుకునేందుకు ప్రజలు గత వారం ఎగబడటంతో ఈ ఆరోపణలు మరింత పదునెక్కాయి. తిరిగి జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 100శాతం బ్యాలట్ బాక్స్ లను లెక్కించినప్పటికీ అందులో సగానికి పైగా బాక్సుల్లో మోసం జరిగివుంటుందన్న అనుమానంతో అధికారులు రెండోసారి లెక్కించారు.   ఈ లెక్కింపులో పీనా నీటో 38 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా లోపెజ్ ఓబ్రడార్ 31శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. నీటో ఆయనపై 33లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినట్లు ఎన్నికల కమిషన్  ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ తరఫున బరిలోకి దిగిన జోసఫినా మూడో స్థానంలో నిలిచారు. ఈ ఫలితాలను ఫెడరల్ ఎలక్టోరల్  ట్రిబ్యునల్ సెప్టెంబర్ లో ధృవీకరిస్తుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  After gadafi ruling now libiya is new environment
Uttar pradesh cm akhilesh yadav facing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles