After gadafi ruling now libiya is new environment

after gadafi ruling now libiya is new environment

after gadafi ruling now libiya is new environment

21.gif

Posted: 07/08/2012 06:58 PM IST
After gadafi ruling now libiya is new environment

       లిబియాలో జరుగుతున్న చరిత్రాత్మక ఎన్నికల్లో  ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 200మంది సభ్యులు గల జాతీయ అసెంబ్లీ సభ్యులను ఎన్నుకు నేందుకు వారు ఓటు చేశారు. కొత్త రాజ్యాంగం రూపకల్పన ద్వారా దశాబ్ధాలుగా సుదీర్ఘకాలం అనాగరిక పాలనలో మగ్గిన లిబియా ఇక ప్రజా స్వామ్య దేశం అవుతుందని లిబియా ప్రజలు ఆశిస్తున్నారు. గడాఫీ పాలనా కాలంలో లిబియాలో libyaరాజకీయ పార్టీలను నిషేదించాడు. 1960 తర్వాత ఈ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగలేదు.  తాజా పార్లమెంట్  ఎన్నికల్లో 4 వేల మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. 120స్థానాల్లో ఇండి పెండెంట్లు పోటీ చేస్తుండగా, 80మంది రాజకీయ పార్టీల నుంచి పోటీలో ఉన్నారు. చమురు నిల్వలు ఎక్కువగా ఉండే తూర్పు లిబియాకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని కోరుతున్న గిరిజన నాయకులు ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పార్లమెంటరీ స్థానాల కేటాయింపు అన్యాయం అని వాదిస్తూ వారు ఈ బహిష్కరణ ప్రకటించారు. లిబియాలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కుల హామీని ఇవ్వలేదని గిరిజన నాయకులు  ఆరోపించారు.
    దేశంలోని ఆగేయ ప్రాంతం ట్రిపోలిటానియాకు 109స్థానాలు కేటాయించగా తూర్పు ప్రాంతం సైరెనైకాకు 60స్థానాలు ఇచ్చారు. ఫెజ్జాన్ ప్రాంతానికి 31సీట్లు ఎన్నికల కమిషన్ కేటాయించింది. ఈ ఎన్నికలకు విఘాతం కలిగించినట్లయితే లిబియాలో అంతర్యుద్ధం తలెత్తే ముప్పు ఉందని నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ కమిటీ హెడ్ ఫతి ఆల్ బజా అన్నారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో లిబియాలో నాలుగు రోజుల క్రితమే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New system for divorce
Mexico country new president  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles