Gujarat village with 24 hr wi fi

Gujarat’s first Wi-Fi village, Bhagu Patel, Sarpanch Shailesh Rathod

Welcome to Gujarat’s first Wi-Fi village, no thanks to govt - Eighteen kilometres from the nearest town of Valsad in south Gujarat sits Tighara, a village where locals communicate

Gujarat village with 24-hr Wi-Fi.gif

Posted: 07/04/2012 03:16 PM IST
Gujarat village with 24 hr wi fi

Villageఓ వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపించాడు. తన ఊరి రూపురేఖలనే మార్చేశాడు. ఆ ఊరికి 24 గంటల పాటు ఇంటర్నెట్ కనెక్షన్ ని అందించే వైఫై టవర్, దాంతో పాటు ఆప్టికల్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్, ముఖ్యమైన అన్ని కూడళ్ళ వద్ద సీసీ కెమెరాలు, వాటర్ ఫ్రూఫ్ లౌడ్ స్పీకర్లు, మినీబస్సు రవాణా వ్యవస్థ, కేవలం నాలుగు రూపాయలకే 20 లీటర్ల సురక్షితమైన తాగునీటి సరఫరా, ఎక్కడా చెత్తా చెదాం కనిపించని తారురోడ్లు, రోగులను ప్రేమగా పలకరించే వైద్యులతో కూడిన ఆసుపత్రి, ఎనిమిది పాఠశాలలు... మనదేశంలో మెట్రోనగరాల్లో కూడా కనిపించని ఈ సదుపాయాలన్నీ గుజరాత్ లోని ఒక కుగ్రామంలో లభిస్తున్నాయి. ఆ గ్రామం పేరు పన్సారీ. సబర్ కాంత్ జిల్లాలో ఉంది. ఆరేళ్ళ కిందటి వరకు అన్సారీ మన దేశంలోని ఇతర గ్రామాల్లాగే ఉండేది. గతుకుల రోడ్లు, వాటి మీద ప్రవహించే మురికి కాలువలు, వీధి దీపాల కొరత వంటి సమస్యలన్నీ ఉండేవి. 2006 లో హిమంశు పటేల్ సర్పంచ్ గా ఎన్నికైన తర్వాతే ఈ గ్రామ రూపు రేఖలు మారటం మొదలైంది.

గ్రామాన్ని బాగుపరచడానికి అవసరమైన నిధుల కోసం ఉమ్మడి భూములను అందరి ఆమోదంతో ప్లాట్లుగా విక్రయించారు. వచ్చిన సొమ్మును డిపాజిట్ చేసి వడ్డీతో అభివ్రుద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సౌరశక్తితో నడిచే వీధిదీపాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో తిరగడానికి మినీ బస్సులను సమకూర్చుకున్నారు. ఈ బస్సుల్లో 1 రూపాయి టిక్కెట్ తో బ్యాంకుకు, పొలానికి, పాల కేంద్రానికి, ఎక్కడికైనా వెళ్లవచ్చు. గ్రామస్థులందరికీ రూ. లక్ష ప్రమాద భీమా చేయించారు. రోడ్ల పై చెత్తా చెదారం వేయకుండా నిఘా కోసం కూడళ్ళ వద్ద 25 సీసీ కెమెరాలు బిగించారు. అన్ని వీధుల్లోనూ కలిసి 120 స్పీకర్లను ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం ఈ స్పీకర్లలో భజనలు, భక్తి గీతాలు వినిపించటమే కాక, టెలిఫోన్, కరెంటు బిల్లులు, 10వ తరగతి ఫలితాలు సందర్భంగా ప్రకటనలు కూడా చేస్తారు. విరాళాలుగానీ, ఎన్నారైల సహాయం లేకుండా స్వశక్తితో అభివ్రుద్ధి సాధించిన పన్సారీ గ్రామానికి ఎన్నో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు దక్కాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Two year old girl dies in baby care center
Coming back after 45 years  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles