Two year old girl dies in baby care center

two year old girl dies in baby care center,baby center, day care, children hosptial, doctor, nurses, hydarabad, lb nagar, anvitha death in day care, chapathi, throat sturk

two year old girl dies in baby care center

girl.gif

Posted: 07/04/2012 03:41 PM IST
Two year old girl dies in baby care center

two year old girl dies in baby care center

నిన్నటి వరకు నీటి బోరు బావులు పసివారిని మింగటం వరకు మనకు తెలుసు. అందరికి తెలియాని చేదు నిజం  మనం తినే చపాతి కూడా పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నాయంటే ఆశ్చర్యంతో నమ్మాలి.  ఒక చపాతి  వలన  ఆనందంగా ఉండే కుటుంబంలో విషాదచాయాలు అలుముకున్నాయి.  అది ఎక్కడో కాదు మన  హైదరాబాద్ ఎల్.బి. నగర్ లోని ఆర్‌కె పురంలోని లక్ష్మీ బేబీ కేర్ సెంటర్‌లో అన్విత అనే చిన్నారి చపాతి తింటుండగా అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆ చిన్నారి ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ పాపను బేబీ కేర్ సెంటర్ నిర్వాహకులు వెంటనే దగ్గర్లోని కామినేని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.  వైద్యులు ఆ పాప మృతి చెందినట్లు తెలిపారు. చపాతి గొంతులో ఇరుక్కోవడం వల్లే అన్విత మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పాప కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బేబీ కేర్ సెంటర్ పైన, నిర్వాహకుల పైన తల్లిదండ్రులు కేసు పెట్టనున్నారని తెలుస్తోంది.

ఎల్‌బి నగర్‌లోని టెలిఫోన్ కాలనీలో లవకుశ, రజిత దంపతులు ఉంటున్నారు. రజిత ఓ ప్రయివేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. లవకుశ ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటలకు తమ తమ విధులకు వెళ్తారు. తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వస్తారు.  ఇంట్లో ఎవరూ ఉండక పోవడంతో తమ రెండేళ్ల చిన్నారి అన్వితను లక్ష్మీ బేబీ కేర్ సెంటర్‌లో వదిలేసి వెళతారు. రోజులాగే ఈ రోజు కూడా తల్లిదండ్రులు పాపను కేర్ సెంటర్‌లో వదిలారు. వారు చిన్నారులకు చపాతి పెట్టారు. అది గొంతులో చిక్కుకొని అన్విత మృతి చెందింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Frans country man
Gujarat village with 24 hr wi fi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles