యుపిఏ తరపున రాష్ట్రపతి పదవి కోసం పోటీపడుతున్న ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ వాదుల నుంచి నిరసన సెగ తప్పలేదు. యుపిఏ రాష్టప్రతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీని అడ్డుకునేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ప్రణబ్ ముఖర్జీకి ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రభృతులు ఘనస్వాగతం పలికి జూబ్లీహాలులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) సమావేశానికి తీసుకుని వెళ్ళారు. కాగా బేగంపేట విమానాశ్రయంలో ప్రణబ్ ముఖర్జీకి కండువాలు కప్పి స్వాగతం పలికేందుకు రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ అనుచరులు, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, ఆమె భర్త బండ చంద్రారెడ్డి అనుచరులు పోటీ పడ్డారు. అయితే ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో మంత్రి దానం నాగేందర్ బండ చంద్రారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది గమనించిన ప్రణబ్ కొంత చిరాకు పడ్డారు. మరోవైపు ప్రణబ్ కాన్వాయ్ వెళ్ళే దారిలో బేగంపేట విమానాశ్రయం చౌరస్తా, ప్రకాశ్ నగర్ వద్ద తెలంగాణ మాల మహానాడు నేతలు, కార్యకర్తలు తెలంగాణ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more