Railway tatkal ticket timing changed

railway tatkal ticket timing changed

railway tatkal ticket timing changed

31.gif

Posted: 07/01/2012 07:53 PM IST
Railway tatkal ticket timing changed

      అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకులకు ఉపయోగకరంగా వుంటుందని ప్రవేశపెట్టిన తత్కాల్ రైల్వే రిజర్వేషన్ వల్ల సాధారణ ప్రయాణీకుల కంటే దళారులే ఎక్కువగా లాభం పొందుతున్న విషయాన్ని గుర్తించిన రైల్వేశాఖ తత్కాల్ రిజర్వేషన్ వేళల్లో మార్పుచేసింది. ఈ 3ప్రకారం ఇకపై ఉదయం 10 గంటల తరువాతే తత్కాల్ రిజర్వేషన్లు అందుబాటులో వుంటాయని రైల్వే అధికారులు ప్రకటించారు. తత్కాల్ రిజర్వేషన్లలో అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు రైల్వేశాఖకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఉదయం 8 గంటలకే రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో వుండడంతో దళారులు ముందుగా రిజర్వేషన్లు చేయించుకొని, అనంతరం వాటిని బ్లాక్‌లో విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ప్రయాణీకులకు వీలైన సమయాన్ని అమలు చేయాలని నిర్ణయించి, ఉదయం 10 గంటలకు మాత్రమే తత్కాల్ రిజర్వేషన్లు కౌంటర్లను తెరువనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ విధానం ఈనెల 10వ తేదీ నుంచి అమలుకానుంది. విధి నిర్వహణలో రైల్వే సిబ్బంది సెల్‌ఫోన్ వినియోగంపై కూడా రైల్వే శాఖ నిషేధం విధించింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minor fire in hyderabads jubilee hall after pranab visit
Upa presidential candidate states tour  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles