Upa presidential candidate states tour

upa presidential candidate states tour

upa presidential candidate states tour

13.gif

Posted: 07/01/2012 07:50 PM IST
Upa presidential candidate states tour

      రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం తనదేనని యూపీఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ ధీమా వ్యక్తం చేశారు. నిన్న   చెన్నైనుంచి తన ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆయన ఇవాళ హైదరాబాద్ వచ్చారు. ఉదయం పదకొండున్నర గంటలకు జూబ్లీహాల్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలను కలిసి తనకు ఓటువేయమని కోరారు. ఆ తరువాత మధ్యాహ్నం తాజ్ క్రిష్ణాహోటల్ లో ఎంఐఎం నేతలతో భేటీ అయ్యారు..
    కాగా,  యూపీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రాల్లో పర్యటిస్తోన్నారు. తన అభ్యర్ధిత్వాన్ని బలపర్చమంటూ వివిధ రాజకీయ పార్టీలను కోరుతున్నారు. తమిళనాడులోని డీఎంకే అధినేత కరుణానిధిని కలిసి తనకు మద్దతివ్వారని ప్రణబ్ కోరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలో ఆంద్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్య లో ఓట్లు ఉండటంతో ఇక్కడ పలు పార్టీల నాయకులను కలిసి తనకు మద్దతు 1-7maintopప్రకటించాల్సిందిగా ప్రణబ్ విజ్నప్తి చేశారు. కాగా,  కోన్నిరోజుల క్రితం జైళ్లో జగన్ ను కలిసినప్పడు ప్రణబ్ ముఖర్జీకి ఒటు వేయాల్సిందిగా తాను కోరినట్లు అసదుద్దిన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీతో అసదుద్దిన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్  ఎవరికి మద్దతు ఇస్తారనే విషయం కూడా ప్రణబ్ పర్యటనలో చర్చకు వచ్చినట్టు సమాచారం.    
   ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న బలాబలాలను ఓ సారి పరిశీలిద్దాం. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 294 ఎమ్మెల్యేలున్నారు. 42 మంది లోక్ సభ సభ్యులు 18 మంది రాజ్యసభ సభ్యులున్నారు. పార్టీల వారీగా ఎమ్మెల్యేల ఎంపీల సంఖ్యను వారి ఓట్ల విలువను చూస్తే.. ముందుగా కాంగ్రెస్ పార్టీకి 155 మంది ఎమ్మెల్యేలున్నారు. వారి ఓట్ల విలువ 22వేల 940 ఎంపీలు 31 మంది వారి ఓట్ల విలువ 21 వేల 949 ..రాజ్యసభ ఎంపీలు 13 వారి ఓట్ల విలువ 9వేల 204 మొత్తానికి ఎలక్టోరల్ కాలేజీలో మన రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ల విలువ 54 వేల 092. రాష్టంలో రెండో ప్రధాన పార్టీ టీడీపీకి 86 మంది ఎమ్మెల్యేలున్నారు. వారి ఓట్ల విలువ 12 వేల 728 ఎంపీలు ఆరుగురున్నారు వారి ఓట్ల విలువ 4 వేల 248..  రాజ్యసభ ఎంపీల ఓట్ల విలువ 3వేల 540. మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీల ఓట్ల విలువ 20 వేల 5 వందల 16.  మూడో స్థానంలో ఉన్న టీఆర్ఎస్ కి 18 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలున్నారు. వీరి ఓట్ల విలువ 4వేల 80. వైసీపీకి 17 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు  వీరి ఓట్ల విలువ 3వేల 9 వందల 32, ఎంఐఎం కి ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఓట్లవిలువ 17వందల 44. ఇక చవరగా సీపీఎంకి నలుగురు సిపిఐకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వారి ఓట్ల విలువ 740. సంఖ్యాబలంలోను ఓట్లవిలువలోనూ అధికార కాంగ్రెస్ అగ్రస్థానంలో ఉంది.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Railway tatkal ticket timing changed
Another round of service tax  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles