Apsrtc managing director ak khan

APSRTC managing director AK Khan.gif

Posted: 06/27/2012 01:11 PM IST
Apsrtc managing director ak khan

AK-Khanమొన్నటి వరకు హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ గా బాధ్యతలు నిర్వహించి ఈ మధ్యనే ఆర్టీసీ ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన ఏకే ఖాన్ ఆ శాఖ లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఇప్పటికే 500 కోట్ల నష్టాల్లో ఉన్న బస్సు చక్రాన్ని పగతి పథంలో నడిపించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇతను బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆర్టీసీకి రోజు కోటి రూపాయాల ఆదాయం పెరిగిందని అంటున్నారు.

ఇక బస్సులు ప్రమాదానికి గురికాకుండా ఉండేందుకు ఆర్టీసీ డ్రైవర్లకు మానసిక, శారీరక ఆరోగ్యం కోసం యోగాలో శిక్షణనివ్వనున్నట్లు సంస్థ ఎండీ ఏకే ఖాన్ వెల్లడించారు. సోమరితనం, మత్తుగా వారి శరీరాలు ఉండకుండేందుకుగాను మంచి ఆహారపు అలవాట్లపై న్యూట్రిషన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సంస్థ ఆదాయాన్ని పెంచుకోవడం, ఖర్చులు తగ్గించుకునే క్రమంలో ఇంధన పొదుపు, ఓఆర్ (ఆక్యుపెన్సీ రేషియో)ను పెంచుకోవడం తదితర అంశాలపై సిబ్బందికి కౌన్సిలింగ్, గేట్ మీటింగ్‌ల ద్వారా అవగాహన కలిగించనున్నట్లు ఖాన్ తెలిపారు. మరి ఖాన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించి ఆర్టీసీ లాభాల బాట పడుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Petrol prices to be reduced by r4 on july 1
Tv anchor cuts hair for charity loses job  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles