పాకిస్థాన్ ప్రధానిగా పీపుల్స్ పార్టీ నేత రాజా పర్వేజ్ అష్రఫ్ ఎంపికయ్యారు. దిగువ సభ జాతీయ అసెంబ్లీలో ఏర్పాటైన ప్రత్యేక సమావేశంలో నిర్వహించిన ఓటింగ్ లో ఆష్రాన్ కు 211ఓట్లు రాగా ప్రతిపక్ష ముస్లీ లీగ్ నవాజ్ అభ్యర్థి సర్దార్ మెహ్తబ్ అబ్సాసీకి 89ఓట్లు వచ్చాయి. పాక్ ప్రధాని కుర్చీకోసం మూడు రాజకీయ పార్టీలకు చెందిన ఐదుగురు నామినేషన్లు వేశారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్.. జమాతే ఉలెమా ఇస్లాం సంస్త కు చెందిన అభ్యర్ధులు తమ నామినేషన్లు సమర్పించారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరపున మఖ్దూం షాహబుద్దీన్, ఖమర్ జమా ఖైరా, రజా పర్వేజ్ అష్రఫ్ నామినేషన్ వేశారు. అటు పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ గ్రూపు నుంచి సర్దార్ మెహతాబ్ అహ్మద్ ఖాన్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇక జమాతే ఉలెమా ఇస్లామీ సంస్థనుంచి మౌలానా ఫజలుర్ రహమాన్ కూడా నామినేషన్ వేశారు.
అయితే పీపీపీ చివరి నిమషంలో తమ ప్రధాన అభ్యర్ధిని మార్పు చేసింది నిషేధిత మాదక ద్రవ్యాల అక్రమ రవాణ కేసులో షాబుద్దీన్ కు నార్కోటిక్స్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో ఆయన స్థానంలో అష్రాఫ్ ను పార్టీ అభ్యర్థిగా ఎన్నుకున్నారు. గిలానీ వారసుడిగా ఎన్నికైన రాజా పర్వేజ్ అష్రాన్ డిసెంబర్ 26, 1950లో సింద్ లోని సన్ ఘర్ లో జన్మించారు. గుజర్ ఖాన్ నియోజక వర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గిలానీ మంత్రివర్గంలో ఫెడరల్ మంత్రిగా పనిచేశారు. గిలానీ స్తానంలో తమపార్టీకి చెందిన వ్యక్తే రావాలని పట్టుబట్టిన పీపుల్స్ పార్టీ తన పంతం నెగ్గించుకున్నట్లైంది. భుట్టో కుటుంబానికి నమ్మకస్తుడిగా పేరొందిన మరో వ్యక్తినే ప్రధానిని చేసింది. మరోవైపు ప్రధానమంత్రిగా ఎన్నికైన అష్రఫ్ ను పాక్ అధ్యక్షుడు ఆసిప్ అలీ జర్దారీ సహా మాజీ మంత్రులంతా అభినందించారు. ఈనెల 19న సుప్రీంకోర్టు తీర్పుతో ప్రధాని కుర్చీ ఖాళీ అయ్యింది. అధ్యక్షుడు జర్దారీ అవినీతిపై విచారణ జరిపించలేని ప్రధాని పదవిలో వుండేందుకు అనర్హుడంటూ ఈ నెల 19న సుప్రీంకోర్టు గిలానీని తప్పించింది. నిజానికి పాక్ మాజీ ప్రధాని గిలానీపై ఎప్పటినుంచో కోర్టు వత్తిళ్లున్నాయి. జర్దారీ స్విస్ బ్యాంకు ఎక్కౌంట్ల వివాదాన్ని తిరగదోడాలంటూ కోర్టు ఆదేశించింది.
అయితే అధ్యక్షుడికి రాజ్యాంగపరమైన రక్షణ వున్నకారణంగా తానేం చేయలేనని గిలానీ తేల్చి చెప్పారు. అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని కానీ కేసును తిరగదోడే హక్కు తనకు లేదనీ గిలానీ చెప్పారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అతన్ని డిస్మిస్ చేసింది. తక్షణం కొత్త ప్రధానిని నియమించాలంటూ అధ్యక్షుడు జర్దారీకి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కు పాల్పడినందుకు ఏప్రిల్ 26 నుంచే ఆయన అనర్హత అమల్లోకి వచ్చిందని తీర్పుపై 30రోజుల్లోగా గిలానీ అపీల్ చేసుకోవచ్చునని చెప్పింది. అంతేకాదు కొత్త ప్రధాని ఎంపికోసం నోటిఫికేషన్ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ కు కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈసీ వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేసింది. వెనువెంటనే జరిగిన ఈ పరిణామాలతో పాకిస్థాన్ లో సంక్షోభం తలెత్తింది. అయితే చివరకు అష్రఫ్ నియామకంతో సంక్షోభానికి తెరపడింది. ఇక భుట్టో ఫ్యామిలీకి నమ్మకస్తుడిగా పేరొందిన అష్రఫ్.. జర్దారీపై కేసులు తిరగతోడతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more