On real estate name gupta cheates hmda

on real estate name gupta cheates hmda

on real estate name gupta cheates hmda

29.gif

Posted: 06/24/2012 05:34 PM IST
On real estate name gupta cheates hmda

       రియల్ ఎస్టేట్ పేరుతో హెచ్ఎండీఏకు కుచ్చుటోపీ పెట్టిన హైదరాబాద్ వ్యాపార వేత్త గౌరీ శంకర్ గుప్తను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో రెండు కేసుల్లో  అరెస్ట్ నుంచి  తప్పించుకున్న గుప్తా హెచ్ఎండీఏ ఫిర్యాదు కేసులో పోలీసులకు చిక్కారు. అసలు డీఎల్ ఎఫ్ కేసు వివరాలేంటో ఓ సారి పరిశీలిస్తే..  హైదరాబాద్ కూకట్ పల్లిలోని మెట్రో సమీపంలో హెచ్ ఎండీఏకు దాదాపు 25ఎకరాల స్థలం11e ఉంది. ఆస్థలాన్ని స్థలాన్ని అభివృద్ధి చేస్తామంటూ 2003లో డీఎల్ ఎఫ్ కంపెనీ పేరిట దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత విచారణ నేపథ్యంలో వారికి, డీఎల్ ఎఫ్ కు ఎలాంటి సంబంధం లేదని తేలింది. డీఎల్ ఎఫ్ అధీకృత అధికారిగా జీఎస్ గుప్తానే బోగస్ పత్రాలతో దరఖాస్తు చేసుకున్నారని, దానికి అవసరమైన రిజిస్ట్రేషన్ ఫీజు కూడా  తన సొంత ఖాతాల నుంచి చెల్లించినట్లు వెల్లడైంది. దీంతో హెచ్ ఎండీఏ అధికారులు మార్చి 23న సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు.
     హైదరాబాద్ సెంట్రల్, పీవీఆర్ సినిమా, అమీర్ పేట్ లోని బిగ్ బజార్ లకు యజమాని అయిన జీఎస్ గుప్తా ఆయన కుటుంబీకులు నగరంలో ఎస్ బీపీఎల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, జీఎస్ జీ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్షు బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, యాస్కాట్ కన్ స్ట్రక్షన్స్ 11eeప్రైవేట్ లిమిటెడ్, జీఎస్ జీ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీలు నిర్వహిస్తున్నారు. లోయర్ ట్యాంక్ బండ్ లో పాత ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంస్థకు చెందిన 5.24ఎకరాల భూమి ఆధారంగా డీఎల్ ఎఫ్ నుంచి రూ.11కోట్లు, గాంధీ మెడికల్ కాలేజీకి సంబంధించి 5.61ఎకరాల స్థలం ఆధారంగా రూ.280కోట్లు తీసుకున్నారు. తర్వాత గుప్తా అండ్ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించడంతో డీఎల్ ఎఫ్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. అప్పట్లో అరెస్టుకు ముందే గుప్తా సుప్రీం మూడు వారాల స్టే తెచ్చుకున్నారు. గౌరి శంకర్ గుప్తా అరెస్టు అక్రమమని జిఎస్ గుప్తా అనుబంధ సంస్థ ఎస్.బి.పి.ఎల్ సిఈఓ మనోజ్ కుమార్ శర్మ అన్నారు.
     ఇప్పటికే ఈ కేసు సివిల్ కోర్టు పరిధిలో లో ఉందన్నారు. డిఎల్.ఎఫ్ సంస్థ తో తాము కేవలం నిర్మాణనాకి అనువైన భూమిని గుర్తించడంతో పాటు, భూసేకరణ మాత్రమే చేస్తామని అన్నారు. మిగతా నిర్మాణం, మార్కెటింగ్, అమ్మకం మొత్తం డిఎల్.ఎఫ్ సంస్థ చేయ్యవలసి ఉంటుదని చెప్పారు. హైద్రబాద్ లో మార్కెటింగ్ లేకపోవడంతో తమ వద్దనుండి డబ్బును లక్కోనేందుకు డిఎల్.ఎఫ్ ప్రయాత్నింస్తూందని ఆరోపించారు. అయితే గుప్తా ను గుండె నొప్పి రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుప్తాను మంగళవారం కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం సీసీఎస్ పోలీసుల్ని ఆదేశించింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pakistan politics now in critical position
Nearly ten lack ten thousand new jobs in ap it sector  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles