Ysr cong party leader ys vijayamma

YSR Cong party leader YS Vijayamma, YSR party MLAs , assembly , vijayamma leader,

YSR Cong party leader YS Vijayamma

Vijayamma.gif

Posted: 06/21/2012 10:31 AM IST
Ysr cong party leader ys vijayamma

 YSR Cong party leader YS Vijayamma

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకురాలిగా ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఎన్నిక కానున్నారు. జరగనున్న ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో విజయమ్మను తమ నాయకురాలిగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. శాసనసభా పక్ష కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను విజయమ్మకు అప్పగిస్తూ తీర్మానం చేసే అవకాశం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పదిహేడు మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పదిహేనుమంది ఎమ్మెల్యేలు, ఒక లోక్‌సభ సభ్యుడు ఎన్నికైన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఆ పార్టీ తరఫున విజయమ్మ, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా, జగన్మోహన్‌రెడ్డి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం శాసనసభ స్పీకర్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదిహేడు మంది ఎమ్మెల్యేలున్న తమ పార్టీకి శాసనసభ ఆవరణలో కార్యాలయాన్ని కేటాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Koti kumkumarchana at kanaka durga temple
Vayalar ravi submits report to sonia gandhi on ap politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles