Koti kumkumarchana at kanaka durga temple

koti kumkumarchana at Kanaka Durga Temple,Kanaka Durga Temple in vijayawada,Koti Varthi Deepaaradhana and 'Koti Kumkumarchana

koti kumkumarchana at Kanaka Durga Temple

koti.gif

Posted: 06/21/2012 10:35 AM IST
Koti kumkumarchana at kanaka durga temple

koti kumkumarchana at Kanaka Durga Temple

శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్లు కొలువుదీరిన విజయవాడ ఇంద్రకీలాద్రిపై తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి కోటి కుంకుమార్చన, కోటివర్తి దీపారాధన మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జూలై 21వరకు వైభవంగా జరిగే ఈ మహోత్సవాలను పుష్పగిరి పీఠాధిపతి నృసింహ భారతీస్వామి వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభించారు. ఉదయం 6గంటల సమయంలో ప్రధాన ఆలయం నుంచి దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాల మధ్య భవానీదీక్ష మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక ఆసనంపై ప్రతిష్ఠించి హారతులిచ్చారు. ఇక్కడ నిత్యం ఉదయం 8నుంచి 11గంటల వరకు కుంకుమార్చన జరుగుతుంది. ఇక రాజగోపురం ఎదురుగా శ్రీ మల్లికార్జున మహా మండపంలో ప్రతిరోజూ సాయంత్రం దీపారాధన జరుగుతుంది. కుంకుమ సువాసినీలకు అతి ముఖ్యమైన అలంకారం. ఏ ఆభరణం లేకపోయినా నుదుట కుంకుమ ధరించిన స్ర్తి విలక్షణమైన శోభతో పూజ్యురాలుగా నిలుస్తుంది. స్ర్తిమూర్తి దుర్గాదేవికి కుంకుమ చాలా ప్రియమైనది. మహిషాసురమర్దిని అవతారంలో దుర్గమ్మ మహా రౌద్రంగా ఉండేది. అటువంటి రౌద్ర స్వరూపిణిని పరమ శాంతిస్వరూపిణిగా మార్చాలనే సంకల్పంతో శ్రీ శంకరాచార్యులు ఇక్కడకు వచ్చి అమ్మ సన్నిధిలో శ్రీచక్ర యంత్రాన్ని స్వయంగా ప్రతిష్ఠించారు. నాటినుంచి దుర్గమ్మ భక్తులకు కొంగుబంగారంగా, శాంతిస్వరూపిణిగా మారింది. నాటి నుంచి దుర్గమ్మను నిత్యం లలిత సహస్ర నామాలతోనే అర్చిస్తున్నారు. ప్రస్తుతం కోటి కుంకుమార్చన పేరుతో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఆలయ ఇఓ ఎం రఘునాథ్ నిర్వహిస్తున్నారు.

అయితే ఒకరోజు కుంకుమార్చనలో పాల్గొనేందుకు 2,500 రూపాయలు, లేదా 31రోజులు గోత్రనామాలతో పూజ జరిపించుకోడానికి 5వేల రూపాయలు ఫీజుగా అధికారులు నిర్ణయించారు. దీన్ని కొంత ఆర్థిక భారంగానే భక్తులు భావిస్తున్నారు. ఇక కోటివర్తి దీపారాధనకు 50వేల రూపాయలు రుసుముగా నిర్ణయించారు. అయితే ప్రమిద నూనె వత్తులను ఆలయ అధికారులే సమకూరుస్తున్నారు. దీపాల వెలుగులో విమాన స్వర్ణగోపురం ధగధగలను 3వేల మంది భక్తులు ఏకకాలంలో తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీపంలో కన్పించే ఎర్రని కాంతి సృష్టికర్త బ్రహ్మదేవునికి, నీలి రంగు విష్ణు భగవానునికి, తెల్లని కాంతి పరమ శివునికి చిహ్నంగా చెబుతారు. ఇళ్లలో దీపారాధనలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. భక్తులు చేసే ఉపచారాల్లో దీప సమర్పణ ముఖ్యమైనది. దీపాల వెలుగుతో శక్తిని, విజ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని అందించే దుర్గాదేవిని సరస్వతి, మహాలక్ష్మిదేవిగా కూడా భక్తులు ప్రత్యేకంగా కొలుస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yuvraj singh eyes icc world t20 to return to cricket
Ysr cong party leader ys vijayamma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles