Vayalar ravi submits report to sonia gandhi on ap politics

Vayalar Ravi submits report to Sonia Gandhi on AP Politics, sonia gandhi, bosta satyanarayana, cm kiran kumar reddy, congress party, d. srinivasa rao, ys Rajasekara reddy,

Vayalar Ravi submits report to Sonia Gandhi on AP Politics

Sonia.gif

Posted: 06/21/2012 10:25 AM IST
Vayalar ravi submits report to sonia gandhi on ap politics

Vayalar Ravi submits report to Sonia Gandhi on AP Politics

రాష్టప్రతి ఎన్నికల హడావుడిలో ఉండటంతో అది ఒక కొలిక్కి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యవహారాలపై అధిష్ఠానం దృష్టి పెట్టనుంది. ఉపఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రానికి చెందిన కొందరు ప్రముఖులు అధిష్ఠానం పెద్దల్ని కలిసినపుడు వారికి ఇదే విషయాన్ని చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ‘ప్రస్తుతం రాష్టప్రతి ఎన్నిక వ్యవహారం తప్ప ఇంకే విషయాలు పట్టించుకునే పరిస్థితి లేదు, రాష్టప్రతి ఎన్నిక ఘట్టం ముగిసిన తర్వాతగాని, ఒకవేళ రాష్టప్రతి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లయితే వెంటనే రాష్ట్ర వ్యవహారాలపైనే దృష్టి పెట్టనున్నాం’ అని అధిష్ఠానం ప్రముఖులు చెప్పినట్లు తెలిసింది. రాష్టప్రతి ఎన్నిక వ్యవహారం తర్వాత అధిష్ఠానం అజెండాలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలే ప్రథమ స్థానంలో ఉందని వారు చెప్పినట్లు తెలిసింది. అధిష్ఠానం తలపెట్టిన మార్పుల్లో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌ను తప్పించనున్నట్లు తెలిసింది. ఆజాద్ స్థానంలో కేంద్రమంత్రి వాయలార్ రవిని లేదా మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్‌ను గాని నియమించనున్నట్లు తెలిసింది. వాయలార్ రవిని నియమించాలనుకున్న పక్షంలో ముందుగా ఆయన్ను ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా గాని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యునిగా గాని నియమించాల్సి ఉంటుంది. వాయలార్‌కు ప్రస్తుతం ఎఐసిసిలో ఎటువంటి పదవి లేదు. దిగ్విజయ్ సింగ్ ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జోడీ తాము ఆశించిన, అనుకున్న స్థాయిలో సంతృప్తికరంగా లేదని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్‌ల జోడీ నాయకత్వంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. వీరిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నప్పటికీ వారిలో ఎవరూ బహిరంగంగా బయటపడలేదని, ఏదైనా ఉంటే అధిష్ఠానవర్గం దృష్టికి మాత్రమే తీసుకువచ్చే వారని ఎఐసిసి నాయకులు అభిప్రాయపడుతున్నారు. చాలామంది మంత్రుల పని తీరు కూడా సంతృప్తికరంగా లేదని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో ఇప్పుడున్న ‘టీం’తో 2014లో సాధారణ ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమేనన్న అభిప్రాయంతో అధిష్ఠానం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న ఆశ లేదని, కనీసం మెరుగైన ఫలితాలు సాధించేలా అయినా చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం అనుకుంటున్నట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr cong party leader ys vijayamma
Sangma quits ncp to contest president poll  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles