Pcc president botsa satyanarayana has reportedly submitted

PCC president Botsa Satyanarayana has reportedly submitted,AICC general secretary Gulam Nabi Azad in New Delhi on the party's defeat

PCC president Botsa Satyanarayana has reportedly submitted

Botsa.gif

Posted: 06/20/2012 10:25 AM IST
Pcc president botsa satyanarayana has reportedly submitted

PCC president Botsa Satyanarayana has reportedly submitted

వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల ప్రజల్లో నెలకొన్న సానుభూతి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని నిర్ణయాల మూలంగానే రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌కు పిసిసి అధ్యక్షుడు, రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ నివేదిక ఇచ్చారు. బొత్స ఢిల్లీకి వచ్చిన వెంటనే నేరుగా గులాం నబీ ఆజాద్ నివాసానికి వెళ్లి, ఉప ఎన్నికల ఫలితాలపై నివేదిక అందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోలింగ్‌కు ముందు అరెస్టు చేసి జైలుకు పంపటం జనానికి రుచించలేదని, దీనికితోడు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల జిల్లాల్లో పర్యటించటం వారికి బాగా కలిసొచ్చిందని, ప్రజల్లో సానుభూతి ఏర్పడిందని బొత్స వివరించినట్టు తెలిసింది.

దీంతోపాటు పెట్రోలు ధర పెంచటం, విద్యుత్ కొరత, చార్జీల పెరుగుదల తదితర కారణాల మూలంగా కాంగ్రెస్‌కు ఓట్లు పడలేదని అభిప్రాయపడినట్టు తెలిసింది. బొత్స కేంద్ర మంత్రి, ఉప ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు వయిలార్ రవిని కూడా కలుసుకుని ఉప ఎన్నికల్లో పార్టీ పరాజయానికి దారితీసిన పరిస్థితుల గురించి చర్చించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై లోతుగా చర్చించేందుకు బొత్స ఈనెల 24 లేదా 25న మరోసారి ఢిల్లీకి రానున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కూడా అప్పుడే ఢిల్లీకి వస్తారు. ఇరువురు నేతలూ ఆజాద్‌తో సమావేశమై ఉప ఎన్నికల ఫలితాల గురించి మరోసారి విశే్లషించి తగు దిద్దుబాటు చర్యలు తీసుకోనున్నారు. రాష్టస్థ్రాయిలోనే ఉప ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ జరుపుతున్నామని బొత్స మీడియాకు వెల్లడించారు. జిల్లాస్థాయిలోనూ సమీక్షలు జరుగుతున్నాయి. విశే్లషణల తదుపరి ఏం చేయాలనేది ఆలోచిస్తామని వెల్లడించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister ganta srinivasa rao
Ghazal beautyfull afghan female singer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles