West bengal cm mamata benerji in trouble

west bengal cm mamata benerji in trouble

west bengal cm mamata benerji in trouble

5.1.gif

Posted: 06/18/2012 04:58 PM IST
West bengal cm mamata benerji in trouble

      పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ కష్టాల్లో పడ్డట్టు కనిపిస్తున్నారు. రాష్ట్ర అభ్యర్థి ఎంపిక విషయంలో తనదైన వైఖరితో యూపీఏను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ ఇప్పుడు తానే సమస్యలో ఇరుక్కున్నట్టు కనిపిస్తున్నారు. యూపీఏ పెద్దలు ఒకొటంటే తానొకటనడం మమతకు ఆది నుంచి అలవాటే. కాంగ్రెస్ పెద్దలను సంప్రదించకుండా ఎస్సీ నేత ములాయంతో కలిసి రాష్ట్రపతి అభ్యర్థుల పేర్లను మమత ప్రకటించడం కలకలం రేపింది. తనమొండి వైఖరితో కాంగ్రెస్ అధినేత్రి సోనియాను తన దారిలోకి తెచ్చుకోవాలని మమత చూశారు. 2e
         కాంగ్రెస్ కోర్ కమిటీలో చర్చించి సోనియా ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేరుని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. అయినా మమత తన పట్టు వీడలేదు. తాను చెప్పిన ముగ్గురి పేర్ల నుంచే ఒకరిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో యూపీఏ కూడా మొండివైఖరిని అవలంభించింది. ప్రతి విషయలో మమతా బెనర్జీ పట్టువిడుపులకు పోతున్నారని ఈ సారి మాత్రం ఆమె బెదిరింపులక లొంగకూడదని నిర్ణయించుకుంది. దీంతో రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ప్రణబ్  వైపే మొగ్గుచూపారు. అటు మమతకు మద్దతుగా నిలుస్తున్న ఎస్పీ నేత ములాయంను తమవైపు తిప్పుకునేందుకు సోనియా చేసిన విశ్వప్రయత్నాలు ఫలించాయి. ప్రణబ్ కే తమ మద్దతు అని ములాయం కూడా ప్రకటించారు.
         తనకు మద్దతుగా నిలుస్తారనుకున్న ములాయం సోనియా వైపు వెళ్లిపోవడంతో మమత కాస్త నిరాశ చెందినట్టు కనిపిస్తున్నారు. ఇంతలో సొంత రాష్ట్ర నుంచి కూడా దీదీపై విమర్శలు వస్తున్నాయి. అమితమైన ప్రాంతీయ అభిమానం ఉన్న వ్యక్తిగా ముద్ర పడ్డ మమత సొంత రాష్ట్ర వ్యక్తి అయిన ప్రణబ్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలు కూడా మమతపై ప్రభావం చూపినట్టు కనిపిస్తున్నాయి.
        దీదీ ఓ మెట్టుదిగి ప్రణబ్ కు మద్దతు తెలిపి యూపీఏలో కొనసాగుతారా..? లేక మొండివైఖరితో యూపీఏకి దూరమవుతారా అన్నది తేలాల్సి ఉంది. అయితే మమతా బెనర్జీని యూపీఏ కూటమి నంచి వెళ్లగొట్టే ఆలోచని లేదని ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. కూటమిలో ఉండాలో వద్దో ఆమె తేల్చుకోవాలన్నారు. ఒక వేళ వెళ్లాలని నిర్ణయించుకున్నా తాము వద్దనమని దిగ్విజయ్ చెప్పారు. ములాయం సింగ్ యూపీఏ మాటకే విలువివ్వడం.. సొంత రాష్ట్ర ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడం కూటమి నుంచి వైదొలుతామంటే ఆపమన్న కాంగ్రెస్ పెద్దల వ్యాఖ్యలతో ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ ఆత్మరక్షణలో పడిపోయినట్టు కనిపిస్తోంది. తన పంతం వీడి ప్రణబ్ కు మద్దతిస్తారో లేక యూపీఏ కూటమి నుంచి వైదొలుగుతారో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Liquor syndicate investigation
Apj abdhul kalam rejection  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles