Apj abdhul kalam rejection

apj abdhul kalam rejection

apj abdhul kalam rejection

4.1.gif

Posted: 06/18/2012 04:52 PM IST
Apj abdhul kalam rejection

      ఈ దఫా ప్రెసిడెంట్ ఎవరనే దానిపై వినూత్న పరిణామాలు ఎదురవుతున్నాయి. తాజాగా  రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయకూడదని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కలామ్ చేశారు. ఎన్డీఏ కూటమి తరపున పోటీచేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ కోరగా అందుకు కలామ్ సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. అయితే రాష్ట్రపతి ఎంపిక రేసు నుంచి కలామ్ తప్పుకోవడం మమతా బెనర్జీకి దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది.1 కలామ్ తాజా నిర్ణయంతో మమతా ఎలాంటి ఎత్తు వేస్తోందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కలామ్, సోమనాథ్ చటర్జీ, మన్మోహన్ సింగ్ పేర్లను మమతా బెనర్జీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. యూపీఏ ప్రతిపాదించిన ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వంపై మమతా అనాసక్తిని ప్రదర్శిస్తోంది.
        ఈ పరిస్థితుల్లో 13వ రాష్ట్రపతి ఎవరన్న అంశంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. మిత్ర పక్షాలు, భాగస్వామ్య పక్షాలతో ఎన్డీఏ సంప్రదింపులు కొనసాగుతూనే వున్నాయి. కలాం పోటీకి దిగననడం, సంగ్మా వెనక్కి తగ్గేది లేదనడంతో ఎన్డీఏ అయోమయంలో పడిపోయింది. ఏదేమైనా 2014 ఎన్నికల లక్ష్యంగా తన కూటమిని బలోపేతం చేసుకునేందుకు ఎన్డీఏ ఈ ఎన్నికను వాడుకుంటోంది.
      మరోవైపు అన్నాడిఎంకె, బిజెడి ఇప్పటికే సంగ్మాకు మద్దతు ప్రకటించారు. ప్రణబ్ కున్న అనుభవం, అర్హతల రీత్యా పోటీ పెట్టరాదని జెడియూ నేత శివానంద తివారీ పట్టుబడుతున్నారు. ప్రణబ్ గెలుపు అవకాశాలు స్పష్టంగా వున్నాయని, పార్లమెంటులోనూ, ప్రభుత్వంలోనూ అత్యంత అనుభవ శీలి అయిన ప్రణబ్ అభ్యర్ధిత్వానికి తిరుగులేదని ఆయనంటున్నారు. ఆయన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి అత్యంత సన్నిహితుడు. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రణబ్ ముఖర్జీని పోటీ లేకుండా ఎన్నుకోవడం మంచిది కాదని అడ్వానీ, సుష్మా స్వరాజ్ వాదించారు. సంగ్మాను పోటీకి దింపితే అన్నాడిఎంకె, బిజెడి లాంటి మిత్రపక్షాల తో స్నేహం మళ్లీ పెరుగుతుందని అది వచ్చే ఎన్నికల నాటికి ఉపయోగపడుతుందని బిజెపి ముందు చూపుతో వుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  West bengal cm mamata benerji in trouble
Political parties strength change in assembly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles