State students fare well in aieee

State students fare well in AIEEE,AIEEE, Andhra students performance

State students fare well in AIEEE

AIEEE.gif

Posted: 06/11/2012 12:10 PM IST
State students fare well in aieee

ర్యాంకు కోసం  ఢిల్లీ లో పెద్ద రచ్చ జరిగింది.  ప్రభుత్వ స్కూల్ లో  చదువుకు విద్యార్థికి  ఫస్ట్ ర్యాంకు రావటం పై పెద్ద రచ్చ ర్చ జరిగింది. కొన్ని కాలేజీ లు  ఆ విద్యార్థి కోసం పోటీ పడి  రచ్చ చేశాయి.బిటెక్‌లో జాతీయస్థాయిలో వచ్చిన మొదటిర్యాంకుపై వివాదం నెలకొంది. ఎఐఈఈఈ ఫలితాల్లోని బిటెక్‌ విభాగంలో ఢిల్లీకి చెందిన సందీప్‌పత్రీ మొదటిర్యాంకు సాధించారు. సందీప్‌పత్రీ ఢిల్లీ ప్రభుత్వస్కూల్‌ విద్యార్థి అని ఫలితాలు విడుదల చేసిన సిబిఎస్‌ఇ డైరెక్టర్‌ పత్రికలకు తెలిపారు. ఈ ప్రకటన ఢిల్లీ పత్రికల్లో వచ్చింది. అయితే ర్యాంకు సాధించిన సందీప్‌పత్రీ తన సంస్థలో శిక్షణ తీసుకున్నారని శ్రీచైతన్య విద్యాసంస్థలు ప్రకటించుకోవడంపై వివాదం చెలరేగింది. ప్రభుత్వస్కూల్‌లో చదువుకున్న విద్యార్థిని ఏ రకంగా తమ విద్యార్థిగా ప్రకటించుకుంటారని పలువురు విద్యావేత్తలు మండిపడుతున్నారు.

సందీప్‌పత్రీకి ఐఐటీలో వెయ్యి ర్యాంకు వచ్చింది. ఆ విషయాన్ని ఎవరు కూడా ప్రస్తావించలేదు. కానీ బిటెక్‌లో మొదటిర్యాంకు వచ్చిన తర్వాత శ్రీచైతన్య విద్యాసంస్థలు ప్రకటించుకోవడాన్ని తప్పుపడుతున్నాయి. ఇతర సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు మరో విద్యాసంస్థల్లో శిక్షణ తీసుకోవడం సహజమని, ఇలాంటివి ఐఐటిలోనూ కొనసాగుతోందని, సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లోనూ ఉంటాయని శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యం తెలిపింది. విద్యార్థి ర్యాంకుపై ఢిల్లీలో శ్రీచైతన్య విద్యాసంస్థలు రెండుసార్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఆ విద్యార్థి తమ దగ్గర శిక్షణ తీసుకున్నట్లు ఆ విద్యార్థి చెబుతారని అన్నారు. కాలేజీలో చదువుకున్న విద్యార్థికి ర్యాంకు వస్తే ప్రకటించుకోవాల్సి ఉన్నా ఇతర విద్యాసంస్థల్లో చదువుకున్న వారి ర్యాంకులను తమవిగా చెప్పుకోవడం తప్పుగా కొందరు అంటున్నారు. ర్యాంకులపై సిబిఐతో విచారణ చేయించాలని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల లెక్చరర్ల అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మధుసూదనరెడ్డి డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi to conduct narco test on ys jagan
Anurag kashyap fake email  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles