రాజ్యసభ సభ్యుడిగా సచిన్ టెండుల్కర్ అధికారిక నివాసం కేటాయింపుపై పుకార్లు కమ్ముకుంటున్నాయి. రాహుల్ గాంధీ ఇంటికి ఎదురుగా సచిన్ కు కేటాయించిన 5వ నంబర్ క్వార్టర్లో గతంలో నివసించిన ఇద్దరు ఎంపీలు ప్రమాదాల్లో మరణించారనే వార్తలు వెలుగులోకొచ్చాయి. దీంతో సచిన్ ఈ క్వార్టర్లో చేరుతారా లేదా అనే విషయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జడ్ ప్లస్ సెక్యూరిటీ, టైప్ 7క్వార్టర్ కేటాయింపు ఆనందం సచిన్ కు అట్టే నిలచేట్టు లేదు. వివిఐపిలు నివసించే ప్రాంతంలో సచిన్ కు కేటాయించాలని పిడబ్ల్యుడి విభాగాన్ని హోంశాఖ ఆదేశించింది. దీంతో రాహుల్ గాంధీ, వీరప్పమొయిలీ వంటి ప్రముఖులు నివసించే తుగ్లక్ లేన్ లో 5వ నంబర్ క్వార్టర్ ను కేటాయించారు. సరిగ్గా రాహుల్ నివాసానికి ఎదురుగా ఉండే ఈ ఇంటిపై పుకార్లు గుప్పుమనడంతో సచిన గృహప్రవేశం సస్పెన్స్ గా మారింది.
నాలుగెకరాలకు పైబడిన విస్తీర్ణంలో 7వేల అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ క్వార్టర్లో గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ, హర్యానా మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కుమారుడు సురేందర్ సింగ్ నివసించారు. వీరిద్దరూ ప్రమాదాల్లోనే మృతిచెందారు. హర్యానా సీఎం కుమారుడు సురేందర్ సింగ్ 2005మార్చి 31న హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనలో సురేందర్ సింగ్ తో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ఓపి జిందాల్ కూడా మరణించారు. ఇక ఢిల్లీ సీఎం సాహిబ్ సింగ్ 2007 జూన్ 30న ఢిల్లీ-జైపూర్ నేషనల్ హైవే -8పై జరిగిన ప్రమాదంలో మృతిచెందారు.
అప్పట్నుంచి సాహిబ్ సింగ్ కుటుంబం ఇదే క్వార్టర్లో నివసిస్తోంది. ఢిల్లీ-హర్యానా శివారు గ్రామానికి చెందిన సాహిబ్ సింగ్ ఈ ఇంటిని తన అభిరుచికి అనుగుణంగా సొంత ఇంటిలా తీర్చిదిద్దుకున్నారు. ఇంటి ఆవరణలో పశువుల కొట్టం, ధ్యానమందిరం వంటి వాటిని నిర్మించుకున్నారు. హర్యానా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఇంటిని మార్చారు. తాజాగా ప్రభుత్వం సచిన్ కు ప్రభుత్వం కేటాయించడంతో సాహిబ్ సింగ్ కుటుంబం ఇంటిని ఖాళీ చేసేందుకు సిద్ధమైంది. తొలిసారి ఎంపీ అయిన వారికి టైప్ 5-6 క్వార్టర్లను మాత్రమే కేటాయిస్తారు. సచిన్ టెండుల్కర్ కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా కేంద్రం జడ్ ప్లస్ భద్రతతో పాటు ఎస్కార్ట్ సౌకర్యాన్ని కూడా కల్పించింది. వివిఐపి జోన్ లో ఇంటిని కేటాయించినా ఆ ఇంటిపై వస్తోన్న వార్తల నేపథ్యంలో సచిన్ కొత్త ఇంట్లో చేరుతారో లేదో చూడాలి.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more