Tourist industry in gress

tourist industry in gress

tourist industry in gress

1.11.gif

Posted: 06/10/2012 06:45 PM IST
Tourist industry in gress

      గ్రీస్ లో పర్యాటక రంగం పడకేసింది. మాంద్యంతో పాటు రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో గ్రీస్ లో గడిపేందుకు పర్యాటకులు ఇష్టపడటం లేదు. దీంతో గ్రీస్ కు ఒకప్పుడు భారీగా ఆదాయం తెచ్చిపెట్టిన టూరిజం ఇప్పుడు టూరిస్ట్ లు లేక వెలవెలపోతోంది. యూరోజోన్ ఆర్థిక సంక్షోభంతో గ్రీస్ పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. మాంద్యం దెబ్బకు ప్రధాన రంగాలు దెబ్బతినడంతో ఇప్పుడు అక్కడ అస్తవ్యస్థ పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టూరిజం పడకేసింది. ఆర్థిక అనిశ్చితితో పాటు రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో పర్యాటకులు గ్రీస్ లో గడిపేందుకు ఇష్టపడటం లేదు. నిరంతరం ఆందోళనలతో అట్టుడికిపోతున్న గ్రీస్ ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక పర్యాటకులు గ్రీస్ రావడం మానుకున్నారు. 2

     ఫలితంగా, ఇప్పుడు అక్కడ టూరిజం రంగం పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. టూరిస్ట్ లు లేక ఇప్పటికే పలు హోటళ్లు మూతపడగా, మరికొన్ని మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక పర్యాటక రంగాన్ని నమ్ముకుని ఉన్న వేలాది మంది తమ ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. చారిత్రక కట్టడాలకు, అందమైన బీచ్ లకు పుట్టినిల్లయిన గ్రీస్ ను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఆసక్తి చూపేవారు. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి వేరుగా ఉంది. ప్రఖ్యాత బీచ్ లలో ఒకరిద్దరు పర్యాటకులు తప్ప ఎవరూ కనిపించకపోవడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. ఇక బీచ్ పార్టీ, ఈవెంట్ ల అయితే దాదాపు మూతపడ్డాయనే చెప్పాలి. ముఖ్యంగా మేలో ఎన్నికల జరిగిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. రాజకీయ అస్థిరతతో గ్రీస్ కు పర్యాటకుల్ని దూరం చేస్తోంది. పరిస్థితిని వీలైనంత తొందరగా చక్కదిద్ది గ్రీస్ టూరిజంకు పూర్వ వైభవం తేవాలని, వేలాది కుటుంబాలను ఆదుకోవాలని టూరిజం రంగం నిపుణులు కోరుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sachin official house
Jagan second phase cbi custody  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles