President election

president election

president election

1.9.gif

Posted: 06/10/2012 06:54 PM IST
President election

      రాష్ట్రపతి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాలు అభ్యర్థి ఎంపిక పనిలో మునిగిపోయాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మిత్రపక్షాలతో రెండోదఫా సంప్రదింపులు ప్రారంభించారు. ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్, డీఎంకే నాయకులు స్టాలిన్, టీఆర్ బాలుతో చర్చించిన ఆమె మిగిలిన వారితో ఒకట్రెండు రోజుల్లో మాట్లాడనున్నట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికలే ప్రధాన అజెండాగా సీడబ్ల్యూసీ మరోసారి భేటీ అయింది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా బీజేపీ తాము కచ్చితంగా అభ్యర్థిని5 నిలబెడతామన్న సంకేతాలు ఇవ్వడంతో మిత్రపక్షాలతో పాటు ఇతర పార్టీలకూ ఆమోదయోగ్యుడైన వ్యక్తిని నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ముందువరుసలో ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వానికి మిత్రపక్షాలే కాకుండా విపక్షాలు కూడా మద్దతు పలికే అవకాశం ఉంది. యూపీఏ మిత్రపక్షాలైన ఆర్ఎల్డీ, డీఎంకే బయట్నుంచి మద్దతిస్తున్న ఎస్పీ ఇప్పటికే ప్రణబ్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించాయి. ప్రణబ్ పట్ల వామపక్షాలూ సానుకూలంగానే ఉన్నాయి. మమతా బెనర్జీ తప్ప యూపీఏ భాగస్వామ్యపక్షాలెవరూ దాదాకి వ్యతిరేకంగా లేరు. అయితే పార్టీని, ప్రభుత్వాన్ని ఆదుకోవడంలో ట్రబుల్ షూటర్ గా పేరున్న ప్రణబ్ ను వదులుకోవడానికి సోనియా ఇష్టపడతారా లేదా అన్నదే సస్పెన్స్ గా మారింది.
   6 ప్రణబ్ తో పాటు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్, కేంద్రమంత్రి సుశీల్ కుమార్  షిండే పేర్లు కూడా పరిశీలనలో వున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల పరంగా దళితులు లేదా మైనార్టీలకి అవకాశం కల్పించాలన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈనెల 12తర్వాత రాష్ట్రపతి ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు వున్నాయి. దీంతో సోనియా విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాకే యూపీఏ అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ కూడా మల్లగుల్లాలు పడుతోంది. ఒకరకంగా బీజేపీ తరఫున ఇప్పటి వరకు అభ్యర్థి లేరు. అబ్దుల్ కలాం పేరు తెరమీదకు తెచ్చినా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంటే తప్ప పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. అటు రాష్ట్రపతి అభ్యర్థి బరిలో నిలిచిన లోక్ సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా తనకు మద్దతివ్వాలంటూ బీజేపీ అగ్రనేత అద్వానీని కోరారు. తమిళనాడు, ఒడిషా సీఎంలు జయలలిత, నవీన్ పట్నాయక్... సంగ్మాకు మద్దతు పలికారు. అయితే సొంత పార్టీ ఎన్సీపీనే ఆయనకు మద్దతు పలకడం లేదు. యూపీఏ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. దీంతో పీఏ సంగ్మా కాంగ్రెస్ అభ్యర్థి కావడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఆయన భవితవ్యం బీజేపీ నిర్ణయంపైనే ఆధారపడి వుంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించాకే బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైపోయినట్టేనని రాజకీయ విశ్లేషకులన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Up cms wife dimple create record
Sachin official house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles