Jagan second phase cbi custody

jagan second phase cbi custody

jagan second phase cbi custody

11.gif

Posted: 06/10/2012 03:20 PM IST
Jagan second phase cbi custody

     ఆస్తుల కేసులో సీబీఐ జగన్ ను రెండో దఫా కస్టడీలోకి తీసుకొన్న సంగతి తెలిసిందే. మొదటిరోజు విదేశీ కంపెనీలు, పెట్టుబుడులపై జగన్ ను సీబీఐ అధికారులు విచారించారు. జగన్ కంపెనీల్లోకి దేశ, విదేశాల నుంచి పెట్టుబడుల ఎలా వచ్చాయో ప్రశ్నించారు.1a దాదాపు ఆరున్నర గంటలపాటు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ, డీఐజీ వెంకటేశ్.. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో జగన్ ను ప్రశ్నించారు. మారిషస్ కు చెందిన ఫ్లూరీఎమర్జింగ్, టూఐ క్యాపిటల్, ఏషియా ఇన్ ఫ్రా లాంటి విదేశీ కంపెనీల నుంచి జగన్ సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులపై ఆరా తీశారు. అయితే సిబిఐ కి జగన్ పూర్తిస్థాయిలో ప్రతిస్ఫందించనట్టు సమాచారం. నేడు ఎక్కువ ప్రశ్నలకు నాకు తెలియదు అన్న సమాధానమే ఇస్తున్నట్టు తెలుస్తోంది.
   అయితే,  ఫెమా చట్టం ఉల్లంఘించి మరీ పెట్టుబడులు వచ్చినట్లు సీబీఐ భావిస్తోంది. ఆస్తుల కేసుల కీలక దశలో వున్నందున జగన్ నుంచి విదేశీ పెట్టుబడులపై సమాచారం రాబట్టేందుకు సీబీఐ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశీ పెట్టుబడులపై ఇప్పటికే 6దేశాలకు లెటర్ ఆఫ్ రొగేటరీ ఇచ్చిన సీబీఐ.. ఆ సమాచారం ఆధారంగా జగన్ ను ప్రశ్నిస్తోంది. విదేశీ కంపెనీల్లో కీలకమైనదిగా భావిస్తున్న ఏషియా ఇన్ ఫ్రా అసలు డైరెక్టర్ల సమాచారాన్ని సీబీఐ గుర్తించలేకపోయింది. అయితే ఈ కంపెనీ జగన్ దేనని సీబీఐ భావిస్తోంది.
    రాష్ట్రానికి చెందిన నల్లడబ్బును విదేశాలకు తరలించి... ఈ కంపెనీ ద్వారా పెట్టుబడులుగా పెట్టారని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. ఈ వ్యవహారంలో జగన్ సన్నిహితుడు సుఖేష్ గుప్తాను సీబీఐ మరోసారి విచారించే అవకాశం వుంది. సుఖ ేష్ గుప్తా నుంచి నల్లధనం విదేశాలకు వెళ్లిందని సీబీఐ భావిస్తోంది. దీంతో విచారణలో చివరిరోజు జగన్ ఒక్కరినే విచారిస్తారా..? విదేశీ కంపెనీలతో సంబంధాలు వున్న వారితో కలిపి విచారిస్తారా..? అన్నది సస్పెన్స్ గా మారింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tourist industry in gress
Weather report  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles