Weather report

weather report

weather report

17.gif

Posted: 06/10/2012 02:47 PM IST
Weather report

      రాష్ట్ర ప్రజలకు శుభవార్త. సోమవారం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని విశాఖవాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 18కర్నాటక.. తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలకు దక్షిణ, మధ్య, ఉత్తర బంగాలఖాతం ప్రాంతాల్లోని పలు భాగాలకు విస్తరించడంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర, శని వారం రాత్రి పలుచోట్ల జల్లులకు. అక్కడక్కడ భారీ వర్షం కురిసింది. జార్ఖండ్ నుంచి ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడనద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి, దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. విపరీతమైన ఎండతీవ్రత, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు నిన్న కురిసిన వర్షాలు కొంచెం ఉపశమనాన్ని కలిగించాయి. ఆదివారం కూడా రాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan second phase cbi custody
Only bjp can give telangana sushma swaraj  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles