Only bjp can give telangana sushma swaraj

only bjp can give telangana.. sushma swaraj

only bjp can give telangana.. sushma swaraj

9.gif

Posted: 06/10/2012 02:26 PM IST
Only bjp can give telangana sushma swaraj

      ఎప్పటికైనా బీజేపీ ద్వారానే తెలంగాణ సాధ్యమని ఢంకా బజాయిస్తుంది బీజేపీ.12 పరకాల బీజేపీ అభ్యర్థి విజయ్ చందర్ రెడ్డి విజయం కోసం ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించిన తెలంగాణ పోరు సభకు బీజేపీ అగ్ర నాయకురాలు సుష్మాస్వరాజ్  హాజరయి జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఓరుగల్లుకు వన్నె తెచ్చిన రాణిరుద్రమాదేవి, భద్రకాళి అమ్మవారు, సమ్మక్క సారలమ్మకు ఆమె వందనాలు సమర్పించారు. ఓవైపు వర్షం పడుతున్నా పక్కకు కదలకుండా ఆమె ప్రసంగాన్ని కొనసాగించారు. ఎప్పటికైనా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బీజేపీతోనే సాధ్యమన్నారు. గతంలో తాము చేసిన చిన్న రాష్ట్రాల ఏర్పాటును ఈ ప్రాంత ప్రజలు నిదర్శనంగా తీసుకోవాలని సుష్మా సూచించారు.13 మహబూబ్ నగర్ లో బీజేపీని గెలిపించినందుకు సుష్మా ధన్యవాదాలు తెలిపారు. పరకాల ప్రజలు కూడా తమను విశ్వసించాలని కోరారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి  ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.
   అటు బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కిషన్ రెడ్డి...టీఆర్ ఎస్ పై నిప్పులు చెరిగారు. 11యేళ్లైనా ఆ పార్టీ తెలంగాణకు ఒరగబెట్టిందేమి లేదన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో ప్రజలను వంచిస్తున్నారని విమర్శించారు. బిజేపి నిర్వహించిన పోరు సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళాకారుల ఆటాపాటా జనాన్ని అలరించింది. నేటి సాయంత్రంతో ప్రచారం గడువు ముగుస్తుండటంతో పరకాలలో  గెలుపుకోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Weather report
Aieee exam results release today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles