Konijeti rosaiah in rashtrapati race

konijeti rosaiah in Rashtrapati race

konijeti rosaiah in Rashtrapati race

konijeti rosaiah in Rashtrapati race.gif

Posted: 06/08/2012 06:16 PM IST
Konijeti rosaiah in rashtrapati race

Roshaiahమరి కొద్ది రోజుల్లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలల హడావుడి ఎప్పటి నుండో మొదలైంది. రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతుంది. ఇంతకు ముందు వరకు రాష్టపతి రేసులో మన ఆర్థిక మంత్రి ప్రణబ్ దాదా, ప్రస్తుత లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ పేర్లే కాకుండా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి.

తాజాగా ఇవాళ జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటి సమావేశంలో అనూహ్యంగా తెలుగు వాడి పేరు తెర పైకి వచ్చింది. కాంగ్రెసు పార్టీలో చాలా సీనియర్ నేత, కురు వ్రుద్దుడు, వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత., మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పేరు ఇవాళ ప్రస్తావనకు వచ్చింది. ఈ సమావేశంలో రోశయ్య పేరును కాంగ్రెసు పార్టీ అధిష్టానం పరిశీలించినట్లుగా తెలుస్తోంది. పలువురు నేతలు రోశయ్య పేరును ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోశయ్య ఆమోదయోగ్యమైన నేత అని పార్టీలోని పలువురు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం అనూహ్య పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తప్పనిసరి పరిస్థితులలో ఏడాదిలోగా ఆయన సిఎం పదవికి రాజీనామా చేశారు.  ప్రస్తుతం ఆయన తమిళనాడు గవర్నర్‌గా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వామిత్రుడి లాగే పేర్కొనే రోశయ్యకు గతంలో ఎన్నో పదవులు కట్టబెట్టిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్రపతి పదవి కట్టబెడుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  400 trapped in leh landslide
Planning commission toilet at cabinet meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles