No cricketers for arjuna award due to bcci ministry confusion

No cricketers for Arjuna award due to BCCI-ministry confusion,No cricketer nominated for Arjuna, Khel Ratna, Indian international cricketers, Arjuna Award, sports ministry, BCCI, India won the World Cup, Virat Kohli, Indian cricket team

No cricketers for Arjuna award due to BCCI-ministry confusion

Arjuna.gif

Posted: 06/07/2012 11:17 AM IST
No cricketers for arjuna award due to bcci ministry confusion

No cricketers for Arjuna award due to BCCI-ministry confusion

వాస్తవానికి గత ఏడాది భారత క్రికెట్ జట్టు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెల్చుకుంది. విరాట్ కోహ్లీ వనే్డల్లో అద్భుతంగా రాణించాడు. యువ క్రికెటర్లలో చాలా మంది పేర్లు అర్జున అవార్డుకు ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కానీ, బోర్డు ఎలాంటి ప్రతిపాదన చేయకపోవడం గమనార్హం. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ), కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మధ్య నెలకొన్న అవగాహన లోపం వల్ల ఈసారి క్రికెటర్లలో ఎవరికీ అర్జున అవార్డు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. క్రీడా రంగంలో ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డుకు గత సీజన్‌లో అసాధారణ ప్రతిభ కనబరచిన క్రీడాకారుల పేర్లను ఆయా సమాఖ్యలు పంపాల్సి ఉంది. దీనికిగాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విధించిన గడువు ముగిసినప్పటికీ, బిసిసిఐ ఎలాంటి జాబితానూ పంపలేదు. ఈ విషయంపై బోర్డు అధికారి రత్నాకర్ శెట్టిని ప్రశ్నించగా, అర్జున అవార్డులకు ఒక నిర్ణీత దరఖాస్తు ఫారంలో ప్రతిపాదనలు చేయాల్సి ఉంటుందని చెప్పాడు. అయితే, కేంద్రం నుంచి తమకు ఎలాంటి ఫారాలు అందలేదని స్పష్టం చేశాడు. దరఖాస్తు ఫారాలు పంపకుండానే ప్రతిపాదనలు రాలేదని క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కోవడం విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించాడు. అయితే, కేంద్ర క్రీడల మంత్రి అజయ్ మాకెన్‌కు ఒఎస్‌డిగా వ్యవహరిస్తున్న అభిజిత్ రాయ్ ఈ ఆరోపణలను ఖండించాడు. ఇంటర్నెట్‌లో దరఖాస్తులు ఉంచామని, కాబట్టి క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి అవి అందలేదని ఆరోపించడంలో అర్థం లేదని స్పష్టం చేశాడు. ఈ వాదనలు ఎలావున్నా, క్రికెటర్లకు ఈసారి అర్జున అవార్డును అందుకునే అవకాశం ఉంటుందా అన్నది అనుమానంగానే కనిపిస్తున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu comments on ysjagans arrest
Karunanidhi not averse to backing kalams candidature  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles