Monthly old age pension of rs 200 an insult

'Monthly old age pension of Rs 200 an insult,Old Age Pension scheme,National Rural Livelihood Mission,Manmohan Singh,Jairam Ramesh,IGNOAPS

'Monthly old age pension of Rs 200 an insult'

pension.gif

Posted: 05/21/2012 06:39 PM IST
Monthly old age pension of rs 200 an insult

'Monthly old age pension of Rs 200 an insult'

ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకం(ఐజీఎన్ఓఏపీఎస్) కింద అరవై ఏళ్లకు పైబడిన 3కోట్ల మంది వృద్ధులకు నెలకు రూ.200 పింఛన్ ఇస్తారు. మే 16 న జైరాం రమేశ్ ప్రధానికి రాసిన లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వృద్ధులకు ఇప్పుడు ఇచ్చే పింఛన్ వల్ల వారి వ్యక్తిత్వాన్ని మనము అవమానపరచినట్లేనని అభిప్రాయపడ్డారు. ఇది వారి వ్యక్తిత్వాన్ని కించపరచడమే' అంటూ వృద్ధులకు పింఛన్‌గా రూ.200 ఇవ్వడాన్ని విమర్శిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ఈ పథకాన్ని సమీక్షించాలని ఆయన ప్రధాని మన్మోహన్‌ను కోరారు.. పెన్షన్ పరిషత్ కన్వీనర్లు బాబా ఆధవ్, అరుణారాయ్‌తో జరిగిన సమావేశం తర్వాత జైరాం రమేశ్ ఈ విషయాన్ని లేవనెత్తారు.

పెన్షన్ పరిషత్ వారు తమ సమావేశంలో పింఛన్ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయడానికి దారిద్య్ర రేఖ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకూడదని నిర్ణయించారు. అలాగే పింఛన్ మొత్తాన్ని రూ.300కు పెంచాలని నిర్ణయించారు. పింఛన్ పొందేందుకు ఇప్పుడున్న 60 సంవత్సరాల వయోపరిమితిని మగవారికి 55 సంవత్సరాలకు, మహిళలకు 50 సంవత్సరాలకు తగ్గించారు. పరిషత్ సూచనలలో దారిద్య్ర రేఖను పరిగణనకు తీసుకోకూడదన్న అంశాన్ని పారిశుధ్య కార్యక్రమాలకు, నేషనల్ రూరల్ లైవ్‌లీహుడ్ మిషన్ (ఎన్ఆర్ఎల్ఎమ్), ఇందిరా ఆవాస్ యోజనకు సైతం వర్తింపజేస్తామని జైరాం రమేశ్ ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Historic hindu temple vandalised in pakistan
Cambridge professor given dr manmohan singh chair offer at punjab university  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles