Wankhede village in madhya pradesh

wankhede village in , Madhya Pradesh

wankhede village in , Madhya Pradesh

wankhede.gif

Posted: 05/19/2012 04:59 PM IST
Wankhede village in madhya pradesh

రాష్ట్రపతి ప్రశంసలు సైతం పొందిన ఈ గ్రామం ఎన్నో సార్లు ఆదర్శగ్రామంగా పురస్కారం అందుకుంది. ఈ ఊరిలో మహిళలకు సమాన హక్కులున్నాయి. వేడుకలను అందరూ కలసికట్టుగా నిర్వహించుకుంటారు. ఆస్తి గొడవలొస్తే అన్నదమ్ములే కత్తులు దూసుకునే రోజులివి. డబ్బు విషయంలో తేడాలొస్తే మిత్రులే శత్రువులవుతున్న సమాజమిది. కుల, మత,జాతి, ప్రాంత విభేదాలతో రగిలి పోతున్న ఈ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌లోని వామన్‌ఖేడ్‌ గ్రామం గురించి మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఈర్ష్య, అసూయలకు చోటు లేదిక్కడ. రాథోడ్‌ వంశానికి చెందినవారే ఇక్కడ ఎక్కువగా ఉన్నప్పటికీ అన్ని వర్గాల వారికీ ప్రేమాభిమానాలు సరి సమానం. ఏ ఒక్కరికి సహాయం కావాలన్నా, మరే అవసర మున్నా సత్వరం వారికి చేయూత లభిస్తుంది. ఈ గ్రామ స్త్రీలు వారిళ్ళకు చాలా వరకు తాళాలు వెయ్యరు. కొత్త వారె వరైనా ఈ గ్రామంలోకి అడుగుపెడితే వారి అవసరాన్ని వెంటనే గుర్తించి కావలసిన పనులు చేసిపెట్టి మర్యాదతో సాగనంపుతారు. ఆ మధ్య ఎప్పుడో ఒక వేడుక సందర్భంగా రెండు వర్గాల వారు కేవలం తూలనాడు కున్నందుకు వారిని వెలివేశారు. భారత శిక్షాస్మృతి పరిధిలోకి వచ్చే ఏ ఒక్క నేరం కూడా ఈ గ్రామంలో చోటు చేసుకోలేదు. అందువల్లే పోలీసులు కూడా అడుగుపెట్టలేదు. అంతేగాని బొబ్బలి బ్రహ్మన్న సినిమాలో లాగా ఆ ఊరు పెద్ద కృష్ణంరాజు పరిపాలనలో లేదు. అక్కడంతా మర్యాద రామన్నలే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charanupasana wedding card in tirumala hundi
Cbi seeks more info from ap minister in jagan case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles